ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధానికి ప్రణాళిక సిద్ధమయింది. రాజధాని నిర్మాణానికి ముందుకు వచ్చిన సింగపూర్ నిర్మాణ సంస్థ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రణాలికను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సమర్పించింది. ఈ ప్రణాళికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు, తుళ్ళూరుల మధ్యలో 55 వేల ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణం జరుగుతుంది. రాజధాని నగరంలో ఎనిమిది ఎక్స్ ప్రెస్ హైవేలు, నాలుగు వరుసల రహదార్లు, 135 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ సౌకర్యాలు, అతి పెద్ద విమానాశ్రయం, జల మార్గాలు, పార్కులు, రిజర్వాయర్లు, ఆట మైదానాలు, వాటర్ టాక్సీలు వగైరాల నిర్మాణాలు జరుగుతాయి. మొత్తం రాజధాని ప్రాంతం 7420 చదరపు కిలోమీటర్లు. రాజధానికి అమరావతి అని పేరుపెట్టారు.