మొబైల్ కేంద్రంగా తెలంగాణా

తెలంగాణా రాష్ట్రంలో మొబైల్ తయారీ పరిశ్రమలను స్థాపించడానికి వివిధ అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థలు ముందుకు వచ్చాయి. కొన్ని ప్రముఖ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ను కలుసుకుని, మొబైల్ కంపెనీలను స్థాపించడానికి అవసరమయిన సదుపాయాలను కల్పించ వలసిందిగా కోరాయి. ఆయనను కలుసుకున్నవారిలో సెల్కాన్, ఇండియన్ సెల్యులర్, కార్బన్ మొబైల్స్, ఫాక్ష్ కాన్ సంస్థల ప్రతినిధులున్నారు.
మొబైల్ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే వివిధ కంపెనీలకు కావాల్సిన స్థలం, ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ హబ్ గా మార్చాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒప్పందాలను కుదర్చుకున్నారు. ఈ సంస్థల ప్రతినిధులు ఆ తరువాత హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు.
భూముల లభ్యతను పరిశీలించి, తమకు అనువయిన భూములను ఎంపిక చేశారు. వచ్చే నాలుగేళ్ళలో హైదరాబాద్ నగరంలోనూ, చుట్టుపక్కలా అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చే అవకాశం ఉందనీ, నగరం హైటెక్ దిశగా పరుగులు పెడుతోందనీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Send a Comment

Your email address will not be published.