రాజధానికి భూమి సేకరణ

కొత్త రాజధాని నిర్మాణం కోసం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం భూమి సేకరణకు శ్రీకారం చుట్టింది. కొత్త రాజధాని కోసం కనీసం 30 వేల ఎకరాల భూమి అవసరం అవుతుందని అంచనా. విజయవాడ, మంగళగిరి, తుళ్ళూరు, ఉండవల్లి తదితర ప్రాంతాల నుంచి ఈ భూమిని సేకరించడానికి ప్రభుత్వం నేటి నుంచి రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. రాజధాని కోసం కేవలం భూములను మాత్రమే సేకరించడం జరుగుతుందని, ఇళ్లు, ఇళ్ళ స్థలాల జోలికి వెళ్ళడం జరగదని ప్రభుత్వం ప్రకటించింది. భూమి సేకరణ అంతా కేవలం 17 గ్రామాల్లోనే జరుగుతుంది. ఎకరానికి ధర చెల్లించడమే కాకుండా, తొమ్మిది నెలల్లో వెయ్యి గజాలు పరిహారంగా కూడా చెల్లిస్తారు. పైగా ఆ స్థలాన్ని పూర్తిగా భివృద్ధి చేసి, పదేళ్ళలో దాన్ని అప్పగిస్తారు. నిర్వాసిత రైతులకు ఉపాధి కల్పిస్తారు. సాధ్యమయింత వరకూ సేకరించడానికే ప్రయత్నిస్తామని, లేదంటే చట్టం ద్వారా సేకరించక తప్పదని అధికారులు స్పష్టం చేశారు. మూడు నెలల్లో భోమి సేకరణ పూర్తి చేసి, నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.

Send a Comment

Your email address will not be published.