“లంగా – ఓణీ” - తెలుగు లేడీస్ క్లబ్

13483355_1034702183251436_1202557604599994974_o
13517582_1034702756584712_7387602128891974078_o
తలపైన పాపిడి బిందె, మెడలోన కాసులపేరు, ముక్కుకి పుడక, చెవులకి జుంకాలు, నడుముకి వడ్డాణం, చేతికి వంకీలు, ఓణీ, పరికిణీ – తెలుగింటి ఆడపడుచు పదహారణాల పల్లె పడుచులా కనపడడానికి ఆభరణాలు.

గత పదిహేనేళ్ళలో ఓణీ కాస్తా చీరై పోయింది, జుంకాలు దుద్దులైపోయాయి, ముక్కుపుడక నట్టింటికెళ్ళింది. వడ్డాణం అడ్డమొచ్చింది, వంకీలు వలసపోయాయి.

అయితే మెల్బోర్న్ తెలుగు సంఘం అనుబంధ సంస్థ “తెలుగు లేడీస్ క్లబ్” ఒకటిన్నర దశాబ్దాల క్రితం ప్రారంభించబడి అంచలంచెలుగా ఎదిగి తమ ప్రయాణంలో తీపి జ్ఞాపకాలను నేమరువేసుకోవడానికి “లంగా – ఓణీ” అన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం వయసులో పదిహేనేళ్ళు వెనక్కి వెళ్లకపోయినా వేషధారణలో “లంగా – ఓణీ” ధరించి యుక్తవయస్సుని ప్రతిబింబిస్తూ సరదాగా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. బడలికతో అలసిపోయిన జీవన ప్రయాణంలో మాతృ మూర్తులు రవంత సేద దీర్చుకోవడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది. చిన్న చిన్న నాటికలు, నృత్యాలు, తెలుగు సామెతలు, చిన్ననాటి ఆటలు – ఇలా ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోయి విదేశంలో వున్నట్టు మరచిపోయారు.

13497818_1034702009918120_2428848155740326416_o

13503116_1034702419918079_2963933447001711340_oఈ కార్యక్రమానికి ప్రత్యెక అతిధిగా ఆషా పడిసెట్టి గారు (Counsellor and Educator at Mindful Counselling Australia) విచ్చేసి గృహ సంబంధమైన హింస, కొట్లాటల గురించి మాట్లాడారు. విక్టోరియా రాష్ట్రంలో ఈ విషయానికి సంబంధించి ఏ విధమైన సహాయం అందుబాటులో వుందో వివరించారు. శ్రీమతి విజయ తంగిరాల గారు తెలుగు సంఘానికి తర్ఫీదు పొందిన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.

మెల్బోర్న్ తెలుగు సంఘం, దోస బైట్, స్వీట్ ఇండియా వారు ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించారు.

లేడీస్ క్లబ్ వారు ప్రత్యేకించి శ్రీ విద్యా మోహన్ బొమ్మెన, పవన్ మట్టంపల్లి, విజయ్ చినపల్లి, శ్రీనివాస్ శేషం, అనుపమ శాఖామూరి, లత కట్టా, సమంతా తంగిరాల గార్లకు వారందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
13528467_1034702923251362_819406294288444698_o

Send a Comment

Your email address will not be published.