భారత జాతి ఏవత్తు ఉత్కంటతో ఎదురు చూస్తున్న మధుర క్షణాలు రానే వచ్చాయి. పరిపాలనా పద్ధతిలో మార్పు రావాలని పామరుని దగ్గర నుండి వివిధ రంగాల్లో నిష్ణాతులైన పండితులు అభిలషించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశ దశ తిరుగుతుందా! అన్న ప్రశ్నకు ఔనని జవాబిచ్చారు. ప్రజలందరూ తమ విశ్వాసాన్ని ఒక పార్టీపై అనేకంటే ఒక వ్యక్తిపై వ్యక్తపరిచారు. అయితే ఇందులో వ్యక్తి పూజకు తావు లేకుండా ఆత్మ విశ్వాసం, పరిపాలనా దక్షత, ప్రజలపై ప్రేమ, సామాన్య మానవుడి అవసరాలను గుర్తించే వ్యక్తిని భావి ప్రధానిగా ఎన్నుకున్నారు. వారె శ్రీ నరేంద్ర దామోదర్ మోడీ. 15వ భారత ప్రధానిగా ఈ నెల 26వ తేదీన బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ నరేంద్ర మోడీ భారత రాజకీయ ప్రస్థానం ఒకనాటిది కాదు.
భిన్నమైన వ్యక్తిత్వం
1950 సెప్టెంబర్ 17 వ తేదీన హీరబెన్, దామోదర్ దాస్ మూల్చంద్ మోడీలకు జన్మించిన శ్రీ నరేంద్ర మోడీ వెనుకబడిన వర్గానికి చెందిన వారవడం వలన సామాన్య మానవుని అవసరాలను చిన్నప్పుడే బాగా అధ్యనం చేసి సంఘసేవలో తరించి పోవాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతంగా శ్రీ మోడీ మిగతావారందరి కంటే ఎందుకు భిన్నంగా అనిపిస్తారంటే వీరిలో ముఖ్యంగా మూడు లక్షణాలు చూడవచ్చు. మొదటిది – ఎంతటి చిన్న సమస్యనైనా క్షుణ్ణంగా పరిశీలించడం దానికి ఒక పరిష్కారాన్ని కనుగొని ఆచరణలో పెట్టడం. రెండవది – ప్రతీ సమస్యనీ సూక్ష్మ రీతిలో అధ్యయనం చేయడం ప్రజలకి ఏ రీతిలో అయితే బహుకాలం ఉపయోగ పడుతుందోనని అలోచించి ఆచరణకు సమర్ధవంతమైన నిపుణులను నియమించడమే కాకుండా కార్యానుసరణలో భాగస్వామిగా వుండడం. మూడవది – వీలైనప్పుడు స్థానికంగా వున్న సాంకేతిక నిపుణతను ఉపయోగించడం.
అభివృద్దే మంత్రం
రాజకీయ పరిధులకు అతీతంగా ఎన్నికల సమయంలో కూడా వివిధ దేశాలు పర్యటించి ప్రవాసీయులను ఆకట్టుకొని వ్యాపార పెట్టుబడులు పెట్టడానికి తగు అనుకూల వాతావరణాన్ని సృష్టించి అభివృద్ధి మంత్రాన్ని పాటించారు. ఈ రోజు గుజరాత్ రాష్ట్రాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారంటే దానికి కారణం కొన్ని ఏళ్ల నిరంతర కృషి. భారతదేశంలో స్వాతంత్రయం వచ్చిన దగ్గర నుండి వివిధ నదీ జలాల్ని సమ్మిళితం చేసి వరదలను నివారించాలన్న సంకల్పం ఇంత వరకూ నెరవేరలేదు. గుజరాత్ లో “సుజలాం సుఫలాం” కార్యక్రమంలో భాగంగా ఈ సమస్యని నివారించగలిగారు. అంతే కాకుండా మంచి నీటి సమస్యను వివిధ ప్రాంతాల్లో తీర్చ గలిగారు. 3 సంవత్సరాల్లో 300 కిలో మీటర్ల నిడివిగల కాలువ త్రవ్వించి రికార్డు నెలకొల్పారు. “ఈ-గ్రామ్” కార్యక్రమంలో షుమారు 18, 000 గ్రామాలకు అంతర్జాల సౌకర్యం కలిగించారు. పవర్ గ్రిడ్లు, గ్యాస్ గ్రిడ్లు నిర్మించి సామాన్య మానవునికి సౌకర్యాలను అందజేసారు.
ప్రజలే పాలకులు
శ్రీ మోడీ దృష్టిలో ప్రజలే పాలకులు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వామ్యులుగా వుంటే వారికి సరైన ఫలితం అందుతుందని శ్రీ మోడీ అభిప్రాయం. “పండగలకి ప్రజలందరూ దేవాలయానికి వెళ్ళాలని ఏ ప్రభుత్వమైనా శాసిస్తున్దా? ప్రజలకు ఇష్టం కనుక వాళ్ళు వెళతారు” అంటారు మోడీ. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత్వం చాలా ముఖ్యమైనదని ఇందులో రాజీ పడే ప్రశ్నే లేదని అంటారు.
మోడీ ప్రభంజనం