వీణ - వాణి సమస్యపై MTF స్పందన

twinsవిధి వక్రీకరిస్తే మానవత్వం అక్కున చేర్చుకుంది. విధి వంచిస్తే మానవత మనుగడ సాగిస్తుంది. తోటి జీవిగా చేయూతనిస్తుంది. విశ్రాంతి లేకుండా పరిశ్రమిస్తుంది. వివిధ కోణాల్లో మార్గాలు వెదుకుతుంది. మార్గ మధ్యంలో ముళ్ళబాటలు ఎదుర్కొంటుంది. పరిష్కార మార్గం కనుగొంటుంది.

జన్మతః ఒకే తలతో ఇద్దరు కవలలు “వాణి – వీణ” 13 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లాలో పుట్టి ఇప్పటివరకు చాలా మంది వైద్యుల MTF2పరిరక్షణలో కాలం వెళ్ళదీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మెల్బోర్న్ తెలంగాణా ఫోరం కార్యవర్గ సభ్యులు మెల్బోర్న్ లోని రాయల్ చిల్ద్రెన్ హాస్పిటల్ వైద్య నిపుణులు మరియు అధికారులతో సంప్రదించి వీరిద్దరినీ ఆస్టేలియా తీసుకొచ్చి శస్త్ర చికిత్స చేయాలని పూనుకొన్నారు. ఇప్పటికే ఇరు ప్రభుత్వాల (తెలంగాణా మరియు విక్టోరియా) ప్రభుత్వాధికారులతోనూ మరియు వైద్య నిపుణలతోనూ సంప్రదింపులు జరిపి వైద్య పరీక్షల నివేదికలు రాయల్ చిల్ద్రెన్ హాస్పిటల్ వైద్య నిపుణులకు అందజేయడం జరిగింది. వారు వచ్చే నాలుగు వారాల్లో తమ నిర్ణయం తెలియజేస్తారని MTF పౌర సంబంద అధికారి శ్రీ ప్రవీణ్ తోపుచర్ల తెలిపారు. ఇరు ప్రభుత్వాలు శస్త్ర చికిత్సకు అంగీకరిస్తే అయ్యే ఖర్చు చాలా వరకు ఉంటుందని అయితే తెలంగాణా ప్రభుత్వం ఈ ఖర్చును భరించే అవకాశం వుందని తెలంగాణా ఆరోగ్య శాఖామాత్యులు లక్ష్మా రెడ్డి గారు చెప్పినట్లు MTF అధ్యక్షులు శ్రీ రాజేష్ గారు చెప్పారు.

MTF1ఇంతవరకూ జరిగిన ప్రయత్నాల్లో చాలామంది తెలంగాణా మంత్రులు, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ చంద్ర శేఖర రావు, ఆర్ధిక మంత్రి శ్రీ ఈటెల రాజేంద్ర, రాజ్య సభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ లక్ష్మా రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ నిరంజన్ రెడ్డి మరియు తెలంగాణా ప్రకాష్ గార్లకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వైద్య నిపుణులు ప్రొఫెసర్ కోట రమేష్ రెడ్డి గారు మరియు వైద్య విద్యా సంచాలకులు శ్రీమతి రమణి గారు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారని MTF కార్యవర్గ సభ్యులు తెలిపారు.

మెల్బోర్న్ తెలంగాణా ఫోరం తరఫున డా. శ్రీనివాస్ గుల్లపల్లి, శ్రీ కృపానంద్ కల్వ, రాజు వేముల, అనిల్ దీప్ గౌడ్, పవన్ చోలేటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ఈ శస్త్ర చికిత్స ఆస్ట్రేలియాలో జరగడానికి ఎంతో కృషి చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.