టాలీవుడ్ పరిశ్రమలో ఆ అయిదుగురు అగ్రశ్రేణి దర్శకులు మేటి స్టార్లకు ఏ మాత్రం తీసిపోకుండా డబ్బులు డిమాండ్ చేస్తుంటారు.
మన తెలుగు సినీ రంగంలో ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, వీ వీ వినాయక్, పూరీ జగన్నాధ్, శ్రీను వైట్ల కోట్లలోనే డబ్బులు అడిగి తీసుకుంటారు. వీరిలో ఒక్కొక్కరి పనితనం ఒక్కోలాంటిది.
అయిదుగురిలో ముందు వరసలో ఉన్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఆయన ఒక్కో సినిమాకు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారట. అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులవల్ల కూడా వారికి అదనంగా డబ్బులు అందుతాయి. ఈ కుటుంబ సభ్యులందరూ ఒక్కో విభాగంలో సహకరిస్తారు. ఉదాహరణకు ఆయన భార్య రమ కాస్ట్యూమ్ డిజైనర్. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సోదరుడు. ఆయన కుమారుడు కార్తికేయ కూడా ఆయన ప్రాజెక్టులో ఏదో విధంగా సహకరిస్తుంటారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే ఆయన ఎక్కడా రాజీపడరు. తనకు కావలసిన దానిని మరీ అడిగి తీసుకుంటారు. ఆయనకు మొత్తం మీద సినిమా బాగా రావాలన్నదే అభిమతం.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తావనకు వస్తే ఆయన దాదాపు పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారని భోగట్టా. ఆయన సినిమాలు ఫ్లాప్ అవడం అంటూ ఉండదు. ఆయన పంచ్ డైలాగులకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ డైలాగులతోనే ఆయన ప్రేక్షకుల మనసులు దోచుకుంటారు. ఆయన సినిమాలకు విదేశాలలోనూ ఆదరణ లభించడం విశేషం. రాజమౌళి లాగే ఆయన కూడా ఎక్కడా రాజీ పడరు. ఈయనకు ఉన్న ప్లస్ పాయింట్ దర్శకుడిగానే కాకుండా మాటల రచయిత గాను, స్క్రీన్ ప్లే రైటర్ గాను ఆయన కథను ఆయన అనుకున్న పంధాలో నడిపిస్తారు. దానితో అది రక్తి కట్టడం ఖాయం.
మిగిలిన ముగ్గురు దర్శకుల విషయానికి వస్తే, వీ వీ వినాయక్ తొమ్మిది కోట్ల రూపాయలు, పూరీ జగన్నాధ్, శ్రీను వైట్ల చెరో ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్కో సినిమాకు డిమాండ్ చేస్తారని తెలిసింది.