ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఢిల్లీ లో జరిగిన ఈ ఒప్పందం మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణా రావు, అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లియో కాదియా జాక్ లు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద అమెరికా అధికారులు అతి త్వరలో డిజైన్, నిధులు, రూపకల్పన వంటి అంశాలపై రాష్ట్ర అధికారులతో కలిసి చర్యలు చేపడతారు. అమెరికా వాణిజ్య అభివృద్ధి అధికారులు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో కలిసి ఢిల్లీ వచ్చారు.
ఇది ఇలా వుండగా దావోస్ నగరంలో జరిగిన నాలుగు రోజుల ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొని, ప్రపంచ స్థాయి వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులపై చర్చలు జరిపిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి నగరానికి తిరిగి వచ్చారు.