స్వశక్తితో ఎదురీత

8 వసంతాల సుదీర్ఘ ప్రయాణం

ప్రాశ్చాత్య దేశానికీ ఒక విద్యార్ధిగా వచ్చి కన్న కలలు సాకారం చేసుకోవాలన్న తపన. భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్ది తన కుటుంబానికి చేయూతనివ్వాలన్న ఆకాంక్ష. స్వంత ఊరులో యువతకు స్పూర్తిదాయకం కావాలని ఒక కల. విధి వక్రీకరించడంతో ఊహల పల్లకిలోని ఆలోచనలు అమలు కాకున్నా గమ్యం చేరగలగడం దైవ సంకల్పంగా రూపుదిద్దుకుంది.

మే 21 2009 –
shravan_kumarభారత – ఆస్ట్రేలియా దేశాల చరిత్రలో ఒక మాయని మచ్చ. జాత్యహంకారం పడగలు విప్పి బుసలు కొట్టిన తరుణం. మద్య మాదక ద్రవ్యాలు మదాంధకారంలో తాండవించిన నిశాచర క్షణం. ఒక అభాగ్యుని నిండు ప్రాణాలు అవ్యవస్థ స్థితిలో అణగారిన ఉదంతం.

Shravan Tఎనిమిదేళ్ళ క్రితం ఆస్ట్రేలియాలో వలసదారులపై జరిగిన దాడుల్లో మన తెలుగు అబ్బాయి శ్రవణ్ తీర్థల అత్యంత దారుణ దుర్ఘటనకు గురి కావడం చాలామంది తెలుగువాళ్ళకు గుర్తుండే ఉంటుంది. తమ ఇంటివద్ద స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటూ వుంటే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు రావడం, గొడవ జరగడంతో వారించడానికి ప్రయత్నించిన శ్రవణ్ కి స్క్రూ డ్రైవర్ తో తలకు పొడవడం జరిగింది. స్పృహ లేకుండా నేలకొరిగిన పరిస్థితిలో స్నేహితులు మెల్బోర్న్ లోని రాయల్ మెల్బోర్న్ వైద్యశాలకు తరలించడం అక్కడ షుమారు రెండు నెలలు చికిత్స పొందిన తరువాత పునరావాసంతో కొంత కోలుకున్నాడు.

అయితే తెలుగుమల్లి ఈ ఎనిమిదేళ్ళ ప్రయాణంలో అప్పుడప్పుడూ శ్రవణ్ ని పలకరిస్తూ ప్రస్తుతం ఎలా ఉన్నాడో కనుక్కుందామని…

కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ డిగ్రీ చదవడానికి ఆస్ట్రేలియా వచ్చిన శ్రవణ్ చదువు పూర్తి కావడానికి ఇంకా ఒక సెమిస్టర్ ఉండగానే ఈ దుర్ఘటనకు గురి కావడం జరిగింది. తదనంతరం Sravanతన జీవిత చక్రం పూర్తిగా తారుమారయ్యింది. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇక్కడి భారతీయులు, స్నేహితులు, భారత ప్రభుత్వ దిగ్గజాలు ఇలా ఎంతోమంది తన హితము కోరి పరామర్శకు రావడం, ప్రోత్సాహాన్ని అందివ్వడం జరిగింది.

ఈ ఉదంతం జరిగిన తరువాత భారత ఆస్ట్రేలియా సంబంధాలు కొంత దెబ్బ తిన్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా చక్కదిద్దడానికి అప్పటి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ కెవిన్ రడ్ భారతదేశం సందిర్సించడం కూడా జరిగింది.

పూర్తిగా కోలుకొని 2014లో భారతదేశంలో తనకు నచ్చిన వధువుని పెళ్లి చేసుకొని గత నాలుగేళ్ళుగా ఉద్యోగం చేస్తూ తన కాళ్ళపై నిలబడగల స్థితికి చేరుకున్నాడు శ్రవణ్ . ప్రస్తుతం AMES లో ఎంప్లాయిమెంట్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. గత డిశంబరు నెలలో ఒక పాపకు తండ్రి కూడా అయ్యాడు.  ఆస్ట్రేలియా ప్రభుత్వమూ  పౌరసత్వం కూడా కల్పించింది.

క్రొత్తగా వలస వచ్చినవారికి స్పూర్తిదాయకమై వారు స్థిరపడడానికి సహాయ హస్తం అందిస్తున్నాడు.

Send a Comment

Your email address will not be published.