హిట్లరే నయం!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మళ్ళీ వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రాను లక్ష్యంగా చేసుకున్నారు.
తన తదుపరి చిత్రానికి కె.సి.ఆర్ అని పేరు పెడుతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణా ముఖ్యమంత్రిని చూస్తే నటీమణులు సమంతా, తమన్నా,
ఇలియానాలు గుర్తుకు వస్తారని, ఈ ముగ్గురినీ కలిపితే అందంలో కె.సి.ఆర్
అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. కె.సి.ఆర్ మంచి హిట్లర్ అనీ, హిట్లర్ మాత్రం చెడు కె.సి.ఆర్ అనీ ఆయన ఎద్దేవా చేశారు. రాంగోపాల్ వర్మకు ఇలా ప్రముఖుల్ని ఎంపిక చేసి ఏదో ఒకటి వ్యాఖ్యానించి వివాదాలు సృష్టించడం ఆనవాయితీ. గతంలో ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటివారి మీద కూడా వ్యాఖ్యలు చేశారు.

Send a Comment

Your email address will not be published.