హైదరాబాద్ ది బెస్ట్

వచ్చే ఏడాది ప్రపంచ పర్యాటకులు అందరూ చూడదగ్గ టాప్- 20 పర్యాటక ప్రాంతాల జాబితాను విశ్వ విఖ్యాత నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ తన ‘ట్రావెలర్’ సంచికలో ప్రకటించింది. ఇలాంటి జాబితాల్ని ఇది ప్రతి ఏటా ప్రచురిస్తుంది.

కానీ, ఈసారి ప్రత్యేకత ఏమిటంటే, ఈ జాబితాలో హైదరాబాద్ నగరానికి రెండో స్థానం దక్కడం. జాబితాలో మొదటి స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రెసిడియా నగరానికి దక్కింది. ఇంకా స్విట్జెర్లాండ్ లోని జేర్మాట్, వాషింగ్టన్ లోని నేషనల్ మాల్, ఫ్రాన్స్ లోని కోర్సికా నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి కానీ, ఈ జాబితాలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత సంపన్నుల నగరంగా కూడా పేర్కొనడం విశేషం. ఈ నగరం ఇప్పుడు ఐ.టి బ్రాండ్లకు పట్టుకొమ్మగా మారిందని కూడా అది తెలిపింది. నగరంలోని ప్రముఖ మార్కెట్లు, ముత్యాలు, బిర్యానీను వగైరాల గురించి కూడా ప్రస్తావించింది. నగర సందర్శనకు నవంబర్-మార్చి మధ్యకాలం అనుకూలమయిందిగా కూడా తెలిపింది. ఈ నగరం తరువాతే ఢిల్లీ, ముంబై నగరాలని కూడా అభివర్ణించింది.

Send a Comment

Your email address will not be published.