ATAI తెలంగాణా ద్వివార్షికోత్సవం

DSC_9465
DSC_9223
ఈ నెల 11వ తేదీన ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ అధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం జరిగింది. సందర్భానికి సమయోచితంగా తెలంగాణా రాష్ట్ర పోరాటంలో కీలక పాత్ర వహించిన ఆచార్య కోదండరాం గారు ముఖ్య అతిధిగా రావడం జరిగింది. వారితోపాటు జానపద కళాకారుడు శ్రీ బిక్షు నాయక్ మరియు ప్రముఖ ఆంకర్ కత్తి కార్తీక కూడా వచ్చారు. అమరవీరులకు నివాళి అర్పించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

బంగారు తెలంగాణాకు ప్రవాసీయులు తోడ్పడాలి – కోదండరాం
మాటలో సౌమ్యత, భాషలో మృదుత్వం, భావంలో అభ్యుదయం, తెలంగాణా ప్రజలంటే అభిమానం, తెలుగుదనమంటే వాత్సల్యం, DSC_9392నేలతల్లిని నమ్ముకునే రైతంటే మమకారం, పల్లె ప్రాంతమంటే ప్రాణం. అరవైయేళ్ళ కలల సాకారానికి ఉద్యమ స్పూర్తినిచ్చి ప్రజా పోరాటమే ఊపిరిగా తెలంగాణా ప్రజలపై వున్న మమకారమే ఆయుధంగా కలానికి పదును పెడుతూ కాలంతో పరిగెడుతూ ఒక జీవిత కాలం ప్రజాసేవకు అంకితమిచ్చిన విద్యాధికుడు, రాజకీయ దురంధరుడు శ్రీ కోదండరాం. తెలంగాణా సాధన ఒక ఎత్తైతే అభివృద్ధి పధంలో ముందడుగు వేయాలన్న తపనతో నగరాల్లోనే కాకుండా భారతావనికి ఆయువుపట్టువులైన గ్రామాలకు అభివృద్ధిని తీసుకెళ్లాలన్న ఆకాంక్ష, పట్టుదలతో ప్రవాసీయులు తమ వంతు సహకరించాలని బంగారు తెలంగాణాను నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. ఏ ఏ విధాలుగా ప్రవాసీయులు తమ వంతు సహకారాన్ని అందివ్వగలరో వివరించారు. ముఖ్యంగా వర్షాధారమైన ప్రాంతాల్లో పంటలు లేక ఎంతోమంది రైతులు ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారనీ కేవలం వ్యవసాయం మీదే ఆధారపడే వారిని ఆడుకోవడం చాలా ముఖ్యమని శ్రీ కోదండరాం గారు వక్కాణించారు.

జానపద జావళి – బిక్షు నాయక్
DSC_9712జనపదాలను తన పదాలుగా మలిచి జానపదాలు పాడి జన హృదయాలను జనరంజికం చేసిన జానపద జావళి – బిక్షు నాయక్. తనదైన శైలిలో తెలంగాణా జానపదాలను రక్తి కట్టించే తీరును జోడించి జానపద వాజ్మయానికి పల్లె జీవనం అనుసంధానించి పాడిన ప్రతీ పాట రస హృదయుల గుండెల్లో ఒక చిత్రాన్ని గీస్తుంది. ఒక భావాన్ని ఉప్పొంగిస్తుంది. “నాది” అని మనసుకు హత్తుకుంటుంది. నవరసాలను విసదీకరిస్తుంది. నవనాడుల తన్మయాన్ని కలిగిస్తుంది. “గొల్ల మల్లమ్మ కోడలా!”, “మరదలా నా ముద్దుల మరదలా!”, “కోడి వాయ లచ్చమ్మా”, “గల్ గల్ సప్పుళ్ళ గాజులు తెస్తానే” ఇలా ఎన్నో గేయాలు పాడి, కొన్ని హాస్య గీతాలతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న జానపదుడు బిక్షు నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

శ్రీ ప్రవీణ్ దేశం అధ్యక్షుడుగా ATAI క్రొత్త కార్యవర్గం సారధ్య బాధ్యతలు స్వీకరించింది.  ప్రముఖ దర్శకనిర్మాత శ్రీ క్రాంతి మాధవ్ మరియు విందం సిటీ కౌన్సిల్ యాక్టింగ్ మేయర్ శ్రీ గౌతమ్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం శ్రీమతి మాధురి వాస ప్రార్ధనా గీతం పాడగా మొదలైంది. శ్రీ అమర్ అత్తాపురం తెలంగాణా గేయం పాడి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రముఖ ఆంకర్ కత్తి కార్తీక కార్యక్రమం నిర్వహించారు. అతిధుల సత్కారం తరువాత రఘు కోట్ల గారు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.
DSC_9453

DSC_9626

Send a Comment

Your email address will not be published.