FINACT కి తెలుగు కాపు

FINACT కి తెలుగు కాపు

కాన్బెర్రా తెలుగు సంఘానికి, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్ ఇన్ ACT (FINACT) కి ఒకే సంవత్సరం ఒక తెలుగు నాయకుడు అధ్యక్షులుగా ఎన్నుకోబడడం తెలుగు వారందరికీ గర్వకారణం.  శ్రీ నడింపల్లి కృష్ణ గారు ఈ సంవత్సరం రెండు సంస్థల అధ్యక్ష పదవులకు ఎన్నుకోబడడం కాన్బెర్రా లో భారతీయులంతా తనపై ఉంచిన నమ్మకానికి ప్రతీక అని వేరే చెప్పనక్కరలేదు.  గత సంవత్సరం శ్రీ కృష్ణ గారు తెలుగు సంఘం సారధ్య భాద్యతలతో బాటు FINACT కార్యదర్శిగా పదవీ బాధ్యతలను నిర్వహించి అందరి మన్నలను పొందారు.

 

గత సంవత్సరం తెలుగు సంఘం అధ్యక్షులుగా కాన్బెర్రాలో తెలుగుబడిని మొదలుపెట్టి నిర్విఘ్నంగా నడపడం, కాన్బెర్రా తెలుగు సంఘం దశ వసంతాల సందర్భంగా ఉగాది ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి మొట్టమొదటిగా “తెలుగు వెలుగు” సంచికను ఆవిష్కరించి చరిత్ర పుటల్లో ఒక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.  “రాగం, తానం, పల్లవి” కార్యక్రమం నిర్వహించి చిన్న పిల్లలకు ఎంతో స్పూర్తిదాయకమయ్యారు. శ్రీ కృష్ణ గారు  “కార్యవర్గ సభ్యులు, మరియు స్వచ్చంద కార్యకర్తల సహాయ సహకారాలందించడం వలెనే ఇన్ని కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం కలిగిందనీ, ఈ సంవత్సరం భారతీయులందరూ తనపై మరింత నమ్మకాన్ని ఉంచి FINACT అధ్యక్ష పదవికి కూడా ఎన్నుకోవడం ద్వారా మరెన్నో కార్యక్రమాలను చేపట్టాల్సి వుందని” తెలిపారు.  ఇందులో ముఖ్యంగా ఒక గుడిని కట్టడానికి భూసేకరణ మరియు ఆర్ధిక వనరులు సమకూర్చడం వంటి అత్యుత్తమ లక్ష్యాలను అధిగమించడానికి కృషి చేస్తామని శ్రీ కృష్ణ గారు తెలిపారు.

 

గత సంవత్సరం తెలుగు భాషని ఆస్త్రేలియాలో కమ్యునిటీ లాంగ్వేజ్ గా గుర్తింపు పొందడానికి శ్రీ కృష్ణ గారు ఫెడరల్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి తొలిమెట్టునధిగమించారు.  ప్రస్తుతం ఇది ప్రభుత్వ పరిశీలనలో వుంది.  ఆస్ట్రేలియాలోని అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులను సమన్వయ పరచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో శ్లాఘనీయం.  దీనివలన పెర్మనెంట్ రెసిడెన్సి కి దరఖాస్తు పెట్టుకున్న ప్రతీ తెలుగు వ్యక్తికి  5 పాయింట్లు వస్తాయి.

కాన్బెర్రా తెలుగు సంఘం సభ్యులు:

అధ్యక్షులు  – కృష్ణ నడింపల్లి

ఉపాధ్యక్షులు  – వెంకట్ గున్రెడ్డి

కార్యదర్శి  – ప్రసాద్ చాగంటి

సంయుక్త కార్యదర్శి  – శ్రీ ప్రసాద్

కోశాధికారి  – రాధిక కోమల

సంయుక్త కోశాధికారి  – శేఖర్ రాజ జకిలెట్

కార్యవర్గ సభ్యులు – మంజు నేలపాటి, సుష్మ, రవి సాయల, రుద్ర ప్రసాద్, జగన్ మోదుగు, సిద్ధు మకల్

Send a Comment

Your email address will not be published.