తెలంగాణా రాష్ట్ర పితగా పేరొందిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఐదవ వర్ధంతి సందర్భంగా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణా వాది మరియు తెలంగాణా జాయింట్ ఏక్షన్ కమిటీ అధ్యక్షులు శ్రీ కోదండరాం గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భానికి దారి తీసిన సంఘటనలు, ప్రొఫెసర్ జయశంకర్ గారు పోషించిన కీలక పాత్ర మరియు వారితో తనకున్న సాన్నిహిత్య సంబందాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. శ్రీ జయశంకర్ గారి మరణం తెలంగాణ ప్రజలకు తీరని లోటని అభివర్ణించారు.
ఈ సందర్భంగా శ్రీ జయశంకర్ గారికి ప్రత్యేకంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఇందులో మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్యక్షులు శ్రీ రాజేష్ తౌట్ రెడ్డి గారు, శ్రీ ప్రవీణ్ తోపుచర్ల, శ్రీ కిరణ లింగంపల్లి, శ్రీ క్రుపానంద్ కల్వ, శ్రీ చైతన్య మరియు శ్రీ వెంకట నూకల గార్లు పాల్గొన్నారు.