TANZ అధ్వర్యంలో వినాయక చవితి

IMG-20180920-WA0020
IMG-20180920-WA0018

వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 13 న ఆక్లాండ్ లోని స్థానిక మౌంట్ రాస్కిల్ వార్ మెమోరియల్ హాల్ లో కిక్కిరిసిన భక్త జనుల మధ్య సందడిగా జరిగింది .

కళ్యాణ్ రావు కాసుగంటి మాట్లాడుతూ , తెలంగాణలోని ముఖ్య పట్టణాల్లో పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు , లడ్డు వేలం , సాంస్కృతిక కార్యక్రమాలు , నిమజ్జనం ఊరేగింపులు సర్వ సాధారణం. నవ రాత్రుల సందర్భంగా ప్రతి గల్లీ లో , ముఖ్య కూడళ్లలో వినాయకుడు దర్శనం , పిల్లల నుండి – పెద్దల వరకు అందరి ఇష్ట దేవుడు కొలిచే వినాయకుడి పూజ జరుపుకుంటూ , అందరు తమ జ్ఞాపకాలను , అనుభూతులను తలచుకుంటూ తమ ప్రతి కార్యక్రమం ఎలాంటి విఘ్నం లేకుండా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో , తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ వినాయక చవితి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తోందని తెలిపారు .

ఈ కార్యక్రమంలో ముందుగా భక్తులు వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చిన అనంతరం, సందీప్ ఆచార్య మంత్రోచ్ఛారణతో వినాయక పూజ నిర్వహణ జరిగింది. ఈ సంవత్సరం శ్రీమతి వర్షా రెడ్డి ,నరేందర్ రెడ్డి పట్లోళ్ల దంపతులు , మరియు శ్రీమతి సునీత విజయ్ , విజయభాస్కర్ రెడ్డి కొసన దంపతులు “ సర్వే జనః సుఖినోభవంతు” అని ఆశిస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో లేబర్ పార్టీ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ , నేషనల్ పార్టీ ఎంపీ కాన్వాల్జిత్ సింగ్ భక్షి , ఆక్లాండ్ ఇండియన్ సెంట్రల్ అసోసియేషన్ నుండి ప్రకాష్ బిరదర్ పాల్గొన్నారు .

పూజ అనంతరం భక్తులు వినాయకుడి ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .

సునీతవిజయ్ , శీతల్ఆలం, ఐశ్వర్య కోకా నృత్య ప్రదర్శన భక్తి భావాన్ని నింపింది. వీరితో పాటుగా విజేత రావు, శ్వేతా పట్లోరి, వర్ష రెడ్డి పట్లోళ్ల, లక్ష్మి కాసుగంటి, అరుణ పానుగంటి జత కలిసి నృత్యాన్ని మరింత రక్తి కట్టించారు .

పురుషులు కూడా వినాయకుడు సినీ భక్తి గీతం తో ఇచ్చిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది .

కుమారి గ్రీష్మ కాసుగంటి వినాయకుడి భజనకీర్తన అలరించింది .

ఈ సంవత్సరం కూడా గణేష్ లడ్డు వేలం నిర్వహించారు. గత సంవత్సరం లాగ, ఈ వేలం కోసం శ్రీమతి విజయలక్ష్మి ,మురళీధర్ రంగు దంపతులు తాము స్వయంగా తయారు చేసిన లడ్డును వేలం లో అత్యధికంగా $ 1616 NZD కు పాడి శ్రీహరి రావు బండ, వారి మిత్ర బృందం దక్కించుకున్నారు . ఇది ఒక రికార్డు గా భావిస్తున్నారు .

వినాయకుడి కోసం, ప్రత్యేక ప్రసాదాలు, పులిహోర, తాళపాలికలు పానుగంటి శ్రీనివాస్, అరుణ దంపతులు అందించారు. ఫ్లేవర్స్ అఫ్ ఇండియా – నర్సింగ రావు దువ్వాసి రుచికరమైన మహాప్రసాదం తయారు చేసారు.

ఈ కార్యక్రమంలో ట్యాంజ్ సభ్యులు , ఉపాధ్యక్షురాలు ఉమా సాళ్వజి, జనరల్ సెక్రటరీ ఎడవెల్లి సురేందర్ రెడ్డి, విజేత రావు ఎర్రబెల్లి వినోద్ రావు, రామ రావు రాచకొండ, జగన్ రెడ్డి వొదినాల, లక్ష్మణ్ కలకుంట్ల, నర్సింగ రావు పట్లోరి, పానుగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
IMG-20180920-WA0017
IMG-20180920-WA0019

Send a Comment

Your email address will not be published.