
సునీల్ కొత్త సినిమా “ఫైటర్ శివ”
అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్ చిత్రం “ఫైటర్ శివ” షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో శరవేగంగా దూసుకుపోతోంది. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను దర్శకులు సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు.
ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మణికంఠ కథానాయకుడిగా, ఐరా బన్సాల్ కథానాయికగా నటించారు. ప్రముఖ నటుడు సునీల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక కీలక పాత్రలో కనిపించనుండగా, వికాస్ వశిష్ట కూడా ప్రత్యేక పాత్ర పోషించారు.
ఈ చిత్రంలో మధుసూదన్, యోగి కాట్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శన్విత్ నిమ్మల తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
