రాఖీ పండక్కి వస్తోన్న శర్వానంద్ ‘భోగి’


సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ఈ చిత్రాన్ని రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శర్వా ‘గంగ’ పాత్రలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి హిట్టు అందుకున్న ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి శర్వాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ హిట్‌తో ఆయన తిరిగి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపిస్తున్నారు. ఇదే జోష్‌ను కొనసాగిస్తూ శర్వానంద్ మరో ప్రాజెక్ట్ ‘బైకర్’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 3న విడుదల కానుంది.

ఇక ఇదే సమయంలో శర్వానంద్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘భోగి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో సాగుతుందని చిత్రబృందం వెల్లడించింది. ‘భోగి’లో శర్వానంద్ ‘గంగ’ అనే పాత్రలో కనిపించబోతున్నారు. మాసిన జుట్టు, డార్క్ స్కిన్, గుబురు మీసాలతో చేతిలో కత్తి పట్టుకున్న రగ్గడ్ లుక్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయి సినిమాపై అంచనాలను పెంచింది.

టెక్నికల్ పరంగా కూడా ఈ ప్రాజెక్ట్‌కు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిశోర్ కుమార్ మన్నె ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న ‘భోగి’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అప్‌డేట్‌తో ‘భోగి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Scroll to Top