అందరికీ నచ్చేది ‘పరమపద సోపానం’

అందరికీ నచ్చే సినిమా ‘పరమపద సోపానం’ అని వక్తలు అన్నారు.

అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘పరమపద సోపానం’. స్వయంభూ క్రియేషన్స్ పతాకంపై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న నిర్మాతలుగా నాగ శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, సముద్ర, వీర శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకలో భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిత్ర బృందానికి విజయం చేకూరాలని ఆకాంక్షించారు. హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ, లెజెండరీ దర్శకుల సమక్షంలో ఈ వేడుక జరగడం గర్వంగా ఉందన్నారు.

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతున్నారు. నాగ శివకి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను..అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ “అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు.

ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు వీర శంకర్, హీరో అర్జున్ అంబటి, దర్శకుడు నాగ శివ, హీరోయిన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, డీఓపీ ఈశ్వర్, మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ తదితరులు ఈ ఈవెంట్ లో మాట్లాడారు.

Scroll to Top