
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ‘జనవరి 12 విడుదల’ మూవీ
*******************************************************
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీకి ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే వినూత్న ట్యాగ్‌లైన్‌ను జతచేశారు. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమాని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అనిల్ రావిపూడి మార్క్ వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫెస్టివల్ ట్రేడ్‌మార్క్ ఎంటర్టైనర్ గా ‘జనవరి 12 విడుదల – బావ బామ్మర్ది సౌజన్యంతో’ సినిమా రెడీ అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు సమర్పిస్తున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు. ఎస్. కృష్ణ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
