
విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ‘టాక్సీవాలా’ తర్వాత వచ్చిన మరోసినిమా ‘రణబాలి’ సినిమా తాజాగా ప్రేషకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విశేషాలు ఇలా ఉన్నాయి.
కథ:
ఈ కథ అంగ్లేయుల పాలనా కాలానికి సంబంధించినది. సింగనమల ప్రాంతంలో భద్ర మల్లన్న తాత ఆశీర్వాదంతోనే రాజమ్మ (ఈశ్వరీరావు) ఈ రణబాలి(విజయ్ దేవరకొండ)కి జన్మను ఇస్తుంది. పుట్టిన క్షణమే చావుని జయించి.. మళ్లీ పునర్జన్మను ఎత్తుతాడు రణబాలి. మొరటోడు, మొండోడు అయిన రణబాలి సింగనమల ప్రాంతానికి కాపుకాస్తుంటాడు. రెండు పుష్కరాల ఆయుష్షు మాత్రమే ఉండే రణబాలి ఆ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపు కాస్తుంటాడు. ఇక చావు ఘడియలు దగ్గరకు వచ్చాయని త్వరగా రణబాలికి పెళ్లి చేయాలని రాజమ్మ అనుకుంటుంది. జయమ్మ (రష్మిక మందన్నా)తో రణబాలికి వివాహాం జరుగుతుంది. అదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆగడాలు మితి మీరుతుంటాయి. కొత్తగా వచ్చిన కమిషనర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డో వోస్లో) పన్నుల మీద పన్నులు విధించి, ఉన్న ధాన్యమంతా లాక్కుంటూ ఉంటారు. ఆ సమయంలోనే కరువు కాటకాలతో లక్షల మంది చనిపోతుంటారు. బ్రిటీష్ ఆధీనంలో ఉన్న ఆ ధాన్యాన్ని ప్రజలకు పంచి పెట్టేందుకు రణబాలి రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత రణబాలి చేసిన పోరాటం ఏంటి? ఈ ప్రయాణంలో రణబాలి కోసం జయమ్మ చేసిన త్యాగం ఏంటి? భద్ర మల్లన్న ఇచ్చిన ఆయుష్షుని చివరకు తీసుకుంటాడా? కరువు రాక్షసుడ్ని ఈ రణబాలి అంతం చేస్తాడా? లేదా? అన్నది కథ.
రాహుల్ సంకృత్యాన్ ‘రణబాలి’ కోసం చాలానే రీసెర్చ్ చేసినట్టుగా కనిపిస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువుతో ఎన్నో లక్షల మంది ప్రాణాన్ని వదిలారని, అప్పటి కాలంలో బ్రిటీష్ వారు చేసిన ఆగడాల గురించి ఎంతో రీసెర్చ్ చేశాడనిపిస్తోంది. అయితే ఎక్కడా కూడా డాక్యుమెంటరీగా అనిపించదు. చాలా వరకు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇందులో కొత్తగా కథ ఏమీ కనిపించదు. ఊహకందేలా కథ సాగుతూ ఉంటుంది. బ్రిటీష్ వారి అణచివేత.. ఒక యోధుడు తిరుగబాటు చేయడం.. చివరకు అంతమొందించడం అన్నది కథ. ఇలాంటి కథల్ని మనం ఎన్నో చూసేసి ఉన్నాం. రీసెంట్ టైంలో అంటే మనం ‘సైరా’ని చూశాం. అందుకే మనకు ‘రణబాలి’ కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ రాహుల్ సంకృత్యాన్ విజన్, మేకింగ్ మాత్రం ఇంప్రెస్ చేస్తుంది. ఆయన మేకింగ్ బాగున్నా.. స్లో నెరేషన్, నిడివి కారణంగా సినిమా అందరికీ నచ్చకపోవచ్చు.
ఫస్ట్ హాఫ్ బెటర్‌గా:
ఇందులో ఫస్ట్ హాఫ్ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. రణబాలి ఎంట్రీ.. ఇంట్రో ఫైట్.. ఎంతో ఆసక్తిని తెప్పిస్తుంది. ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడిన్సీలోని ఆగడాలు.. జయమ్మ రాకతో రొమాంటిక్ టచ్ ఇవ్వడం.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా విజయ్, రష్మిక ట్రాక్ ఉండటం ప్లస్ పాయింట్స్. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. చాలా వరకుక బీజీఎం సినిమాని ఎలివేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే చాలా వరకు సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఒక చోట సినిమా అయిపోయిందేమో అని అనుకుంటారు. కానీ ఇంకా అలా సాగుతూనే ఉంటుంది. చివరకు డివైన్ ఫీలింగ్ కలిగించాలని.. కాంతారాలో పెట్టినట్టుగా.. మొన్న ప్యారడైజ్‌లో ధూమావతి కాన్సెప్ట్ పెట్టినట్టుగా.. ఇందులో భద్ర మల్లన్న కాన్సెప్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక చివరకు పూనకంతో విజయ్ చేసే తాండవం ఆయన అభిమానులకు నచ్చుతుంది.
నటన:
నటీనటుల విషయానికి వస్తే విజయ్ తన గత సినిమాలతో పోలిస్తే అద్భుతంగా చేశాడు. కనిపించడంలోనూ, వినిపించడంలోనూ విజయ్ తనలోని భిన్నత్వాన్ని చూపించాడు. రణబాలి పాత్ర కోసం మారిన తీరు, మాటలు పలికించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ విజయ్ విధ్వంసం చేశాడు. ఇక జయమ్మగా రష్మిక తన పాత్రకు న్యాయం చేస్తుంది. బిట్రీష్ ఆఫీసర్లుగా నటించిన వారు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ బాగానే నటించారు. ఈశ్వరీరావు, మదునందన్, లాల్, కిషోర్ కుమార్, కోట జయరాం వంటి వారి తమ పరిధి మేరకు మెప్పిస్తారు.
టెక్నికల్ గా:
టెక్నికల్ విషయానికి వస్తే.. రాహుల్ సంకృత్యాన్ విజన్‌కి తగ్గట్టుగా అన్ని టీంలు అద్భుతంగా పని చేశాయి. మ్యూజిక్, బీజీఎం టాప్ లో ఉంటుంది. విజువల్స్ అయితే ప్రేక్షకుల్ని 1870 ప్రాంతానికి తీసుకు వెళ్తాయి. కాస్ట్యూమ్స్ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తాయి. ఈ సినిమాకి టెక్నికల్ టీం అతి పెద్ద బలం. డైలాగ్స్ మరీ అంత గొప్పగా అనిపించవు.
నటులు: విజయ్ దేవరకొండ, రష్మిక, ఈశ్వరీ రావు
దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్
