ఆరేళ్ళపాటు చిత్రీకరణ చేసుకున్న చిత్రం “గామి”. ఇది విశ్వక్ సేన్ చేసిన ఒక ప్రయోగాత్మక చిత్రం. విశ్వక్ సేన్ తన కెరీర్ ప్రారంభంలోనే గామి కథకు ఓకే చెప్పాడు. కానీ ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఈ ఆరేళ్ల ప్రయాణం గురించి చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో చెబుతూనే వచ్చింది. టీజర్, ట్రైలర్‌తో అందరినీ ఆకట్టుకున్న గామి..ఈనెల 8న విడుదలైన ఈ సినిమా థియేటర్లో ఆడియెన్స్‌ను కూడా బాగానే ఆకట్టుకుంటోంది.
కథలోకి వెళ్తే…
శంకర్ (విశ్వక్ సేన్) అఘోరా ఆశ్రమంలో ఉంటాడు. అతను ఎవరినైనా తాకినా, ఎవరైనా అతడ్ని తాకినా తట్టుకోలేడు. ఒళ్లంతా ఒక రకంగా మారుంది. ఇది మహా దేవుడు అతనికి ఇచ్చిన శాపం అని అఘోరాలంతా కలిసి ఆశ్రమం నుంచి బయటకు వెళ్లగొట్టేస్తారు. ఇక తనకు ఇది శాపమా? పరిష్కరించుకోగలిగే సమస్యేనా? అని అనుకుంటూ పరిష్కారం కోసం ప్రయాణిస్తుంటాడు. ఈ ప్రయాణంలో డాక్టర్ జాహ్నవి (చాందినీ చౌదరి) తోడుగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా ద్రోణ పర్వతంలో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాలను పొందాలను ప్రయత్నిస్తారు. దాంతో అతనికి ఉన్న సమస్య పోతుందని శంకర్ ఆ సాహసానికి బయల్దేరుతాడు. అయితే శంకర్‌కు పదే పదే ఓ బాలిక ఉమ (హారిక), సీటీ 333 (మహమ్మద్) వ్యక్తులు కాపాడమని వేడుకుంటున్నట్టుగా.. వారు పదే పదే గుర్తుకు వస్తుంటారు? అసలు వారితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ ఆ మాలిపత్రాలను పొందుతాడా? శంకర్ తన సమస్య నుంచి బయటపడతాడా? తన సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టే క్రమంలో చేసిన సాహసాలు ఏంటి? అన్నదే కథాంశం.
ఓ జీవిత ప్రయాణంలా
గామి కథను చెప్పుకోవడానికి క్లిష్టంగానే ఉంటుంది.. మనకు చూడటానికి మూడు కథల్లా అనిపిస్తుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటన్నది చివరన తెలుస్తుంది. కొంత మంది ఆ ట్విస్ట్ ఏంటి? అసలు జరిగింది ఏంటి? అన్నది ముందే ఊహించేయగలరు. అయితే ఈ గామి అన్నది ఓ జీవిత ప్రయాణంలా అనిపిస్తుంది. చాలా స్లోగా, నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంతో ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. మూడు కథలను ముక్కలు ముక్కలు చూపిస్తూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు దర్శకుడు.
80వ దశకంలో కథ
గామి కథకు ఓ పర్టిక్యులర్ పీరియడ్, ప్లేస్ అంటూ ఏమీ తీసుకోలేదు దర్శకుడు. చూస్తుంటే ఇది 80వ దశకంలో కథ అని అనుకోవచ్చు. దేవదాసి వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ వ్యవస్థను పరోక్షంగా విమర్శించినట్టు చూపించాడు. పార్టులు పార్టులుగా కథను డివైడ్ చేసి చూపించాడు కాబట్టి.. కాస్త ముందుకు వెళ్తాం.. మళ్లీ వెనక్కి వస్తాం. అయితే కథలో మాత్రం ఫ్లో మిస్ అవ్వదు. మూడు కథల్లో నెక్ట్స్ ఏం జరుగుతుందా? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ వరకు దర్శకుడు అలా మెయింటైన్ చేయిస్తాడు.
ఆకట్టుకునే విజువల్స్
ద్వితీయార్దంలోకి వచ్చే సరికి కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే తెరపై హిమాలయాలు, త్రివేణి సంగమం, ద్రోణ పర్వతం అంటూ చూపించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సార్లు అది రియల్ లొకేషన్ అనిపిస్తుంది.. ఇంకొన్ని సార్లు వీఎఫ్ఎక్స్ అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ తెరపై మాత్రం చూడటానికి ఓ విజువల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. ఇక సింహం వచ్చే సీన్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషన్స్, నటీనటుల యాక్టింగ్ మీద ప్రేక్షకుడు ఫోకస్ పెడితే.. సెకండాఫ్‌లో టెక్నికల్ టీం చేసిన పనితనానికి ఫిదా అవుతాడు. క్లైమాక్స్‌ను చాలా నీట్‌గా, ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ముగించేశాడనిపిస్తుంది. హీరో ఇంకా ఏదైనా చేస్తాడేమో అని ఆశించే వారు కూడా ఉంటారు. కానీ దర్శకుడు మాత్రం ఈ కథను శంకర్ కోణంలోంచి, అతని సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనే దారిలోనే తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని లాజిక్స్ వదిలేసి.. అలా కాసేపు స్లోగా సాగే కథను భరించగలిగేతే.. గామి అనే అద్భుతాన్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు.
టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో
టెక్నికల్‌గా ఈ చిత్రం హై స్టాండర్డ్‌లో నిలుస్తుంది. ఇలాంటి ఓ కొత్త టీం ఇంత తక్కువ బడ్జెట్లో అంత గొప్ప అవుట్ పుట్ ఎలా తీసుకొచ్చిందా? అని షాక్ అవ్వాల్సిందే. విజువల్స్ ఎంతో సహజంగా అనిపిస్తాయి. హిమాలయాలను దగ్గర నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది. పాటలు, ఆర్ఆర్ మూడ్‌కు తగ్గట్టుగా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మ్ంట్ ఇలా అన్నీ అద్భుతంగా తమ పనితనాన్ని చూపించాయి.
నటులు:విశ్వక్ సేన్,చాందినీ చౌదరి,హారిక,మహమ్మద్
దర్శకుడు: విద్యాధర్