ఓటీటీ లో కార్తికేయ 2


ఓటీటీ లోకి వస్తున్న కార్తికేయ 2యంగ్‌ హీరో నిఖిల్ హీరోగా నటించిన సంచలన చిత్రం కార్తికేయ 2. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. పాన్‌ ఇండియా తరహాలో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఏకంగా 130కోట్లు వసూలు చేసింది. చిత్ర యూనిట్‌నే కాదు, ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నార్త్ లో కలెక్షన్ల దుమ్ము దులిపింది.నిఖిల్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆయన్ని ఓ రకంగా పాన్‌ ఇండియా హీరోని చేసేసింది. ఓవర్‌ నైట్‌లో నిఖిల్‌ పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది హిట్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఇంతటి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. సినిమా విడుదలై నెలన్నర కావోస్తుంది. ఇప్పటికీ దీనిపై చర్చనడుస్తుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా జీ5ఓటీటీలో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ కన్ఫమ్‌ అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్‌ 5నే ఈ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుండటం విశేషం. అదే రోజు థియేటర్లో చిరంజీవి గాడ్‌ ఫాదర్‌, నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలతోపాటు యంగ్‌ హీరో బెల్లంకొండ గణేష్‌ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇంతటి భారీ పోటీ నడుమ కార్తికేయ 2ని ఓటీటీలో విడుదల చేయబోతుండటం విశేషంగా భావించవచ్చు.

Scroll to Top