కెప్టెన్ మిల్లర్ గా వస్తున్న ధనుష్

ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీష్, అమెరికన్ యాక్టర్ ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్ట్ సొన్నెన్ బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.ఇక తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కెప్టెన్ మిల్లర్ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పుకొచ్చారు.ఫస్ట్ లుక్ జూన్ లో, టీజర్ జూలైలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ప్రీ లుక్ కూడా అదిరిపోయింది. ధనుష్ కిల్లర్ లా చూపించారు. గన్ పట్టుకొని నడుస్తున్న ధనుష్ బ్యాక్ ను చూపించారు. ఇక ఈ ప్రీ లుక్ సైతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం ధనుష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Scroll to Top