దసరా కానుకగా గాడ్ ఫాదర్

దసరా కానుకగా వస్తున్న గాడ్ ఫాదర్

మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అన్నట్టు రెట్టింపు ఉత్సాహంతో ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించారు. వాటిలో ఒకటైన ‘గాడ్ ఫాదర్’ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ‘ది కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాన్ నటించగా సెన్సేషనల్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేకే ఈ ‘గాడ్ ఫాదర్’ అనే విషయం తెలిసిందే.

ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్ద కుమారుడు మోహన్ రాజా ‘హనుమాన్ జంక్షన్’ తో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత తమిళ్‌లో పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. తమ్ముడు ‘జయం’ రవి హీరోగా ‘తని ఒరువన్’ అనే బ్లాక్ బస్టర్ తీసిన మోహన్ రాజాను.. ఆ సినిమా తెలుగు రీమేక్ ‘ధృవ’ కోసం టాలీవుడ్‌కి తీసుకొచ్చారు అల్లు అరవింద్.. ఆయన వర్క్ నచ్చడంతో ఈ ‘గాడ్ ఫాదర్’ బాధ్యతలు అప్పగించారు.

సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద ఆర్.బి.చౌదరి, ఎన్.వి.ప్రసాద్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. చిరుతో కలసి స్టెప్పులేసి ‘తార్ మార్’ సాంగ్ ఇటీవల రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. సౌత్ స్టార్ నయనతార, సత్యదేవ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ‘గాడ్ ఫాదర్’ మూవీని మలయాళంలో డబ్ చేసి విడుదల చెయ్యబోతున్నారని తెలుస్తోంది.

Scroll to Top