దేవర గా ఎన్టీఆర్


జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను రూపొందిస్తోంది చిత్ర బృందం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన కష్టం ఏ స్థాయిలో ఉందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా వెల్లడించారు. అయితే, ‘దేవర’ టీజర్ ఎప్పుడు అని అడిగితే మాత్రం సరైన సమాధానం చెప్పలేదు. సిద్ధమవుతోందని.. కంటెంట్ ఓకే అనిపించిన తర్వాత తేదీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే, టీజర్ రెడీ అయిపోయిందని సంగీత దర్శకుడు అనిరుధ్ హింట్ ఇచ్చేశారు.

దేవర’ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నారనేది కూడా ఒక పాజిటివ్ అంశం. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రకటించగానే యంగ్ టైగర్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో అనిరుధ్ అందించిన సంగీతం అలాంటిది. ఆల్మోస్ట్ ఆయన సంగీతం అందించిన ప్రతి సినిమా హిట్టే. ఇక ‘విక్రమ్’, ‘జైలర్’, ‘లియో’ లాంటి భారీ చిత్రాలకు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అయ్యింది. కాబట్టి ‘దేవర’కి కూడా అనిరుధ్ బాగా ఫెర్ఫార్మెన్స్ ఇస్తాడని అభిమానుల నమ్మకం.

Scroll to Top