పలు సినిమాల్లో జాన్వీక‌పూర్‌


పలు సినిమాల్లో హీరోయిన్‌గా జాన్వీక‌పూర్‌

అందాల తార శ్రీ‌దేవి కూతురు జాన్వీక‌పూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక టాలీవుడ్‌లో కూడా ఆమె ఎన్‌టిఆర్ స‌ర‌స‌న దేవ‌ర సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు ఈమె మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌ను కొట్టేసింది. త‌మిళ స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘కర్ణ’. ఈ సినిమా మహా భారతంలోని కర్ణుడి పాత్రను బేస్ చేసుకుని తెర‌కెక్క‌బోతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇక‌, ఇప్పుడు ఈ సినిమాలో సూర్య‌కు జోడిగా జాన్వీక‌పూర్‌ను తీసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌డు ఈ వార్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీక‌పూర్‌ను తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే చిత్రబృందం ఆమెను కాంటాక్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇంత‌టి ప్రతిష్టాత్మకమైన సినిమాలో ఛాన్స్ రావ‌డంతో ఆమె కూడా ఒకే చెప్పిన‌ట్లు మీడియా వ‌ర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఈ విష‌యంపై అటు క‌ర్ణ చిత్ర బృందం గానీ జాన్వీక‌పూర్‌గానీ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ్య‌లేదు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ భారీ బడ్జెట్ తో నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో హీరోగా ముందుగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ను సంప్ర‌దించారు. కానీ, కొన్నిఅనివార్య కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆ స్థానంలో త‌మిళ స్టార్ హీరో సూర్యను భర్తీ చేశారు.
త‌మిళ హీరో సూర్య తాజాగా ‘కంగువ’ సినిమా షూటింగ్ పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్పటి వరకు నిర్మించిన తమిళ చిత్రాల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్ర‌ంగా గుర్తింపు తెచ్చుకోనుంది. ఇక‌, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, దిశా పటానీ తమిళ పరిశ్రమలోకి అడుగు పెట్ట‌బోతున్నారు. ఇదే కాకుండా మ‌రో సినిమా కూడా సూర్య చేతిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను సుధా కొంగర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

Scroll to Top