‘ప్రాజక్ట్ – కె’లో ప్రభాస్ ఫస్ట్ లుక్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనె హీరోయిన్ గా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజక్ట్ కె. మొదటి నుండి అందరిలో ఎన్నో భారీ అంచనాలు కలిగిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఇటీవల ఈ మూవీ నుండి హీరోయిన్ దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్, కొద్దిసేపటి క్రితం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఐరన్ సూట్ లో గడ్డంతో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్న ప్రాజక్ట్ కె మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ మరియు రిలీజ్ డేట్ ని ఈనెల 21న అమెరికా లోని శాండియాగో లో జరిగే కామిక్ కాన్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.

Scroll to Top