ఫాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’

సూర్య హీరోగా ఫాంటసీ యాక్షన్ మూవీ కంగువ
*****************

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా సిరుత్తై శివ దర్శకత్వంలో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ మూవీ కంగువ. దీనిని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే కంగువ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు తాజాగా సిజిల్ పేరుతో మరొక టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. రెండిటికి మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సిజిల్ టీజర్ కి అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ లభిస్తుండడంతో.తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు దర్శకుడు శివ.

హీరో సూర్య గారితో నేను తెరకెక్కిస్తున్న కంగువ టీజర్ కి మీ అందరూ అందిస్తున్న రెస్పాన్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, హీరో సూర్య గారికి, జ్ఞానవేల్ రాజా గారికి ప్రత్యేకంగా థాంక్స్ అంటూ దర్శకుడు శివ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Scroll to Top