రజనీ సినిమాలో విలన్ గా రామ్


సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ధర్మన్’. కమల్ హాసన్‌కు చెందిన ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో రజనీతో తలపడే శక్తిమంతమైన నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్ర కోసం టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఎంపిక చేసినట్లు సమాచారం. రజనీ కూతురిగా నటిస్తున్న శ్రీలీలకు జోడీగా కనిపిస్తూనే, రజనీకాంత్‌తో ఢీకొట్టే సన్నివేశాల్లో రామ్ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా రానున్న ఈ యాక్షన్ మూవీ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. చేతిలో స్టెతస్కోప్ పట్టుకుని రోగులను కాపాడే ఒక వైద్యుడు.. అకస్మాత్తుగా చేతుల్లోకి కత్తులు పట్టి రక్తపాతం సృష్టించాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే సరికొత్త, వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఈ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు.

Scroll to Top