‘వాల్తేరు వీరయ్య’గా మెగాస్టార్

‘వాల్తేరు వీరయ్య’గా మెగాస్టార్ చిరంజీవిమెగాస్టార్ చిరంజీవి సరికొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో చిరంజీవి మాస్ లుక్ కు సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. చిరంజీవి వరుసపెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’ తో  ప్రేక్షకుల ముుందుకు వచ్చిన భారీ విజయాన్ని అందుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాన్ని సాధించి పెట్టిన చిత్రమిది. కలెక్షన్ల పరంగా కూడా అదరగొడుతోంది. ఇక చిరు ప్రస్తుతం మెగా154లో నటిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరోవైపు చిరు నటిస్తున్న తదుపరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’  కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ మెగాస్టార్ ను ‘మెగా 154’లో మరింత గ్రాండ్ గా చూపించబోతున్నారు. ఇదే చిత్రంలో  రవితేజ కూడా కీలక పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే.  చిరు, రవితేజ మధ్య కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయని తెలుస్తోంది.  ఇప్పటికే రవితేజ తన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు. చిరు సరసన గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ‘మెగా 154’లో ఆడిపాడనుంది.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సినిమాను  నిర్మిస్తున్నారు.   దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Scroll to Top