విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ *తాజాగా టీజర్‌ విడుదల


సూర్య కొత్త్త సినిమా ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’  *తాజాగా టీజర్‌ విడుదల
******************
కోలీవుడ్‌ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌ గా నటిస్తోంది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా.. 2026 జూలై నెలలో లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సోమవారం టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో 40 ఏళ్ల షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య కనిపిస్తుండగా, అతని కంటే 20 ఏళ్లు చిన్నదైన మమితా బైజు ప్రేమిస్తున్నానంటూ వెంటపడే సన్నివేశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 20 ఏళ్ల అమ్మాయికి 40 ఏళ్ల వ్యక్తికి మధ్య జరిగే కథతో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ఇందులో సంజయ్‌ విశ్వనాథ్‌ అనే మిడిల్ ఏజ్ వ్యక్తిగా, పిస్టల్‌ కాంపిటేషన్స్‌లో ఎన్నో మెడల్స్ సాధించిన షూటర్‌గా సూర్య ఆకట్టుకున్నారు. ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు మరోసారి తన క్యూట్ నెస్ తో ఆకర్షించింది. సూర్య తల్లి పాత్రలో రాధిక కనిపించింది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, నిమిషా రవి సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Scroll to Top