హిరణ్యకశ్యప గా రానా

హిరణ్యకశ్యప గా రానా దగ్గుబాటి

యువ నటుడు రానా దగ్గుబాటి తొలిసారిగా లీడర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యారు. అనంతరం పలు సినిమాలు చేసిన రానా, ఆపైన ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ సినిమాల్లో భల్లాలదేవుడిగా తన అద్భుత నటన తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజగా తన సరికొత్త మూవీని అనౌన్స్ చేసారు రానా దగ్గుబాటి.

శాండియాగో లోని కామిక్ కాన్ ఈవెంట్ లో భాగంగా భారీ ప్రతిష్టాత్మక సినిమా హిరణ్యకశ్యప ని ఒక పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు రానా. ఈ సినిమాలో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథని అందించనున్న ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో స్పిరిట్ మీడియా సంస్థ నిర్మించనుంది. కాగా అతి త్వరలో ఈ భారీ ప్రాజక్ట్ కి సంబంధించి ఇతర నటీనటులు అలానే సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి

Scroll to Top