
సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబోకి ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కామెడీ, ఎమోషన్స్‌తో ఇంత వరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మెప్పించారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఇన్నేళ్ల తర్వాత ‘ఆదర్శ కుటుంబం ఇంటి నెం. 47’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇటీవల విడుదలైన విడుదలైన ఈ మూవీ విశేషాలు .
కథ :
బీహార్‌కి చెందిన చందన్ (ఉదయ్బిర్ సంధు), నీలా (దేవియాని శర్మ) గ్యాంగ్ దోపీడి, హత్యలు చేస్తుంటుంది. మహారాష్ట్రలోని గోరేగావ్‌లో మధు సర్కార్‌లో ఇంట్లో దోపిడీ చేసి జడ్జ్ అయిన ప్రదీప్ సర్కార్ (నాజర్)ని హత్య చేస్తుంది. ఆ తర్వాత వారి కన్ను తెలంగాణ మీద పడిందని ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వస్తుంది. దీంతో ఎస్పీ దామోదర్ నాయుడు (నారా రోహిత్) ఆ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకో వైపు చిట్టి బాబు (వెంకటేష్), స్వర్ణ (శ్రీనిధి శెట్టి), సంపూర్ణ (యువినా పార్వతి), సర్వ (ప్రజ్వల్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఉండే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి చిట్టి బాబుకి వంద కోట్ల లాటరీ తగులుతుంది. ఆపై బీహార్ గ్యాంగ్ కన్ను చిట్టిబాబు ఫ్యామిలీ మీద పడుతుంది. మరి ఆ గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలీని చిట్టిబాబు ఎలా కాపాడుకుంటాడు? అసలు ఈ గ్యాంగ్‌ని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ప్లాన్ ఏంటి? అసలు ఇందులో వేటాడేది ఎవరు? ఎర ఎవరు? చివరకు బలి అయ్యేది ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్రస్తుతం ఉన్న ఆడియెన్స్‌కి రక్తపాతం, హై ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్, చెవులు మోత మోగేలా బీజీఎం ఇష్టంగా ఉంటోంది. త్రివిక్రమ్ కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అయ్యాడు. అయితే తనకు వచ్చిన, నచ్చిన గ్రౌండ్‌ని మాత్రం వదిలి పెట్టలేదు. తన శిలిలో కామెడీ, ప్రాస, పంచ్‌ల్ని వదలకుండా ఈ క్రైమ్, యాక్షన్‌ని అందరికీ నచ్చేలా తెరకెక్కించడంలో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు.
నవ్వించేలా సాగిన కథనం :
దొంగల గ్యాంగ్, వారు హత్యలు చేసే విధానం, వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నం అంటూ కథను చాలా సీరియస్‌గానే స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత చిట్టిబాబు ఫ్యామిలీని పరిచయం చేస్తాడు. అక్కడి నుంచి దాదాపు ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కథ సాదాసీదాగా, ఊహకందేలా సాగుతుంది. అక్కడ మనకు కొత్తదనం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వెంకీ కామెడీ, సత్య ట్రాక్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్ని నవ్వించేలా ఉంటాయి. ఇంటర్వెల్ బ్లాక్‌తో గురూజీ అందరి మైండ్ బ్లాక్ చేసేస్తాడు. ఆ బ్లాక్‌ని చాలా స్టైలీష్‌గా డిజైన్ చేసుకున్నారు. అక్కడి యాక్షన్, బీజీఎం అన్నీ కూడా బాగుంటాయి. సెకండాఫ్ ఏమైనా ఎమోషనల్‌లా సాగదీస్తాడేమో అని అంతా అనుకుని ఉంటారు. కానీ అక్కడ కూడా తివిక్రమ్ జాగ్రత్త పడ్డాడు. సెకండాఫ్‌ని కూడా చాలా వరకు తన కామెడీ, ప్రాసలు, పంచ్‌లతోనే నడిపించాడు. పెద్ద పెద్ద ట్విస్టులు, భారీ క్లైమాక్స్ ఉంటుందని అనుకుంటే మాత్రం పొరబాటే. చాలా సింపుల్‌గానే సినిమా ముగుస్తుంది.
టెక్నికల్‌గా :
టెక్నికల్‌గా చూసుకుంటే కెమెరా వర్క్ బాగుంటుంది. తమన్ పాటల కంటే బీజీఎం బాగుంటుంది. వెంకీ ఆటో నడిపే సీన్లలో సీజీ వర్క్, గ్రాఫిక్స్ పెద్దగా మెప్పించేలా లేవు. అలా కొన్ని చోట్ల కొంత వరకు కొన్ని లాజిక్స్‌ని వదిలేస్తే పూర్తి సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఎడిటింగ్, ఆర్ట్, కాస్ట్యూమ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుంటాయి.
నటన:
హీరో విక్టరీ వెంకటేష్‌కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. నవ్వించడం, ఏడిపించడం, యాక్షన్ సీక్వెన్స్ ఇలా అన్నింటిలో వెంకటేష్ తన మార్క్ చూపిస్తారు. శ్రీనిధి శెట్టికి చాలా కొత్త పాత్ర వచ్చింది. ఆమెను తెరపై చూస్తే అంతా ఆశ్చర్యపోతారు. పిల్లలిద్దరూ బాగా నటించారు. నారా రోహిత్ పాత్ర అంత గొప్పగా అనిపించదు. విలన్ గ్యాంగ్ నటన పర్వాలేదు. సత్య కామెడీ సీన్స్ సినిమాలో హైలెట్. నివేదా పేతురాజ్ పాత్రకి కూడా పెద్ద ప్రాముఖ్యత ఉండదు. రఘుబాబు, బ్రహ్మాజీ రావు రమేష్ ఇలా అందరూ కామెడీతో నవ్విస్తారు. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు మెప్పిస్తారు. ఓవరాల్‌గా ఏకే 47 (ఆదర్శకుటుంబం ఇంటి నెం. 47) బాగానే పేలిందని చెప్పుకోవచ్చు.
నటులు: వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్
దర్శకుడు: త్రివిక్రమ్
