మా గురించి

లాభాపేక్ష లేకుండా ప్రలోభాలకు లోనుకాకుండా ప్రవాసాంధ్రులకు ఆంధ్రామృత సాహితీ సుగంధాలు అందించాలన్న తపనతో తెలుగు భాషా పరిమళాలు ఒక మల్లెలా సువాసనలు వెదజల్లాలన్న ఆశయంతో ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాల తెలుగువారికి అమ్మ భాషలో సేవలందిస్తున్న తెలుగుమల్లికి తొమ్మిదేళ్ళు నిండింది.

ఆస్ట్రేలియా భువనవిజయం  – సాహితీ సంవేదికతో కలిసి కవితాస్త్రాలయ మూడు సంకలనాలు ప్రచురించడం జరిగింది.  క్రొత్త రచయితలకు ప్రోత్సాన్నిస్తూ వారి స్వీయ రచనల పుస్తకాలను ప్రచురించడంలో తెలుగుమల్లి తోడ్పడుతుంది.

ఆస్ట్రేలేషియాలో మొదటిసారిగా రంగస్థల పద్య నాటకాలు ప్రదర్శించడంలో ప్రముఖ పాత్ర వహించింది.  ఇప్పటివరకూ ఈ క్రింది నాటకాలు ప్రదర్శించడం జరిగింది:

  •  నాడు – నేడు (తెలుగు భాష వెయ్యేళ్ళ చరిత్ర లోని కొన్ని ముఖ్య ఘట్టాలు)
  • శ్రీకృష్ణ రాయబారము
  • శ్రీ పార్వతీ కళ్యాణం   
  • శ్రీ మహాకవి కాళిదాసు 

2018వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో ఒక ప్రపంచ స్థాయి సాహితీ సమ్మేళనం జరగడానికి ప్రధాన పాత్ర వహించింది.

భారతదేశం వెలుపల ప్రపంచంలో మొట్టమొదటసారిగా ఆస్ట్రేలియాలో  తెలుగు భాష ఒక సామాజిక భాషగా  గుర్తింపు పొందడానికి విశేష కృషి చేసిన సంస్థ తెలుగుమల్లి. 

ఆస్ట్రేలియా మరియు న్యూ జిలాండ్ దేశాలలో పద్య రచనను ప్రోత్సహించడానికి “పద్య వికాసం” బృందాన్ని స్థాపించి చాలామంది ఛందోబద్ధమైన పద్యాలనూ వ్రాయడానికి ప్రోత్సహిస్తోంది.

Scroll to Top