వాజ్మయి

సి.
సంగీత సాహిత్య సమ్మేళ నంబిది
   సౌహార్డ్ర భావంబు సంఘటిల్లె
రాగాల పల్లవుల్ రమ్యంబుగాపాడి
   అనురాగబంధాల నమరజేసె
సరససల్లాపాల సంభాషణల తోడ
   పద్యవిద్యనుపెంచి పరవశించె
పండిత కవులెల్ల ఖండికల్ రచియింప
వాఙ్మయి క్రమముగా వాసికెక్కె
(పద్యోద్యమము నేడు పరవళ్ళు త్రొక్కగా
   యువత నడత మారె ఉరకలెత్తి)

తే. గీ.
తెనుగు భాషచక్కదనము తెలుప మీరు
నడుము కట్టగా రారండి నడత మార్చి
తెలుగు దీప్తుల దశదిశల్ వెలుగునట్లు
దీక్ష బూనుడు నిచ్చోట తెలివిమీర

–మల్లికేశ్వర రావు కొంచాడ

Scroll to Top