
చరణ్ సాయి హీరోగా.. ఉషశ్రీ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “ఇట్స్ ఓకే గురు”. సుధాకర్ కోమాకుల కీలక పాత్రలో నటించిన ఈ మూవీని మణికంఠ దర్శకత్వం వహించారు. వండర్ బిల్ట్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై సురేష్ అనపురపు, బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ దక్కించుకోగా.. డిసెంబర్ 12 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ.. తాను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకి పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశానని గుర్తు చేసుకున్నారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ని నమ్మి చేసిన సినిమా అది అని.. ఆ మూవీ తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదన్నారు. అలానే ఈ సినిమా చూస్తుంటే తనకు మంచి సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారు. డైరెక్టర్ మణికంఠ, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయని.. ఈ మూవీ కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
