వాముతో ఆరోగ్య ప్రయోజనాలెన్నెన్నో!


వామును తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతానని, ఇందులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు, వ్యాధుల‌కు వాము చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌ని చేస్తుంద‌ని వారు అంటున్నారు. చెడు కొలెస్ట్రాల్.. అజీర్ణ సమస్యలు.. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో సహా ఎన్నింటికో వాము దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆయుర్వేద ప‌రంగా చూస్తే వాము మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

వామును న‌మ‌ల‌డం వ‌ల్ల నోట్లోని బ్యాక్టీరియా న‌శిస్తుంది. దీంతో చిగుళ్ల వాపులు త‌గ్గుతాయి. దంతాల నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాములో థైమోన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది.

వామును తింటే బ్యాక్టీరియా, ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. వాము శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడు తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటులో విశేషమైన పాత్ర పోషిస్తుంది.

వాములో యాంటీ స్పాస్మోడిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల క‌డుపు నొప్పికి వాము దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. ఇది అన్ని ర‌కాల క‌డుపు నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి త‌గ్గిపోతుంది. అజీర్ణం వ‌ల్ల వ‌చ్చే నొప్పిని వాము త‌గ్గిస్తుంది.

వాములో ఉండే థైమోల్ అనే స‌మ్మేళ‌నం ముక్కు రంధ్రాల‌ను క్లియ‌ర్ చేస్తుంది. దీని వ‌ల్ల ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆస్త‌మా, బ్రాంకైటిస్‌, జ‌లుబు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. వామును పొడి చేసి ఒక వ‌స్త్రంలో చుట్టి వాస‌న పీలుస్తుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

వాముతో గుండెల్లో మంట‌, అసిడిటీ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే అసౌక‌ర్యం తొల‌గిపోతుంది. గ్యాస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పొట్ట‌లో గ్యాస్ ఏర్ప‌డ‌కుండా చూసుకోవ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ మెరుగ్గా ప‌నిచేస్తుంది.

Scroll to Top