శోభన్ గూర్చగ వచ్చితీవు వరమై శోభాకృతూ నీవికన్
సౌభాగ్యంబు గదా జనావళికినీ సౌహార్ద్ర సంయోజనా
శోభాలంకృత పాద పద్మములతో శోభిల్లగా జేసినన్
మాభాగ్యంబనియెంచి మ్రొక్కెదము సమ్మానించి నూత్నాబ్దమా!!
రమ్మా శోభకృతాబ్దమా సిరులతో రంజింపగా జేయుమా
లెమ్మా నీవు గతాబ్దమా చరితలో లీనమ్ము కానుండుటన్
సమ్మా నింపుము మా ప్రజావళిని విశ్వాసమ్మునన్ నూత్న వ
ర్షమ్మాభోగములున్ శుభంభులిడుమా సంతోషముప్పొంగగన్
— కావ్యకళాప్రపూర్ణ డా. చింతలపాటి మురళీకృష్ణ