
రామ్ చరణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. తాజాగా అవినాష్ ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. 70వ దశకం నాటి విజయనగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం 24 భారీ సెట్లు నిర్మించామని, సహజత్వం కోసం ఒక ఏడాది పాటు ప్రీ-ప్రొడక్షన్ చేశామని తెలిపారు. ఈ కథలోని ఎమోషన్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందని చెప్పారు.
‘పెద్ది’ విజయనగరం ఏరియాలో 70-80లలో జరిగే పీరియడ్ కథ. అక్కడి వీధులు, క్లాక్ టవర్ ఇవన్నీ రీక్రియేట్ చేశాం. విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలు కూడా డిజైన్ చేశాం. అలాగే కుస్తీ, క్రికెట్ ఆటల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇందులో ఇప్పటివరకు ఎవరూ చూడని కుస్తీ సెటప్ చేశాం. దాని కోసం అండర్‌గ్రౌండ్ సెటప్‌లో షూట్ చేశాం. చరణ్ గదతో కనిపించిన షాట్ అక్కడే చేశాం” అని అవినాష్ కొల్లా చెప్పారు. మొత్తం మీద ‘పెద్ది’ కోసం 24 సెట్స్ వేశామని, అవి కాకుండా దాదాపు 60-70 పైగానే సెటప్స్ ఉంటాయని తెలిపారు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ‘పెద్ది’ జర్నీతో అంతలా ట్రావెల్ అవుతారు. కచ్చితంగా ఆ ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ‘రంగస్థలం’కి మించి ఉంటుందని సుకుమార్ అన్నారు. దానికి కారణం ఈ కథలో అంత బలం ఉంది” అని అవినాష్ చెబుతున్నారు.
