తెలుగువారి మొదటి ఆత్మకథ ఆవిష్కరణ

ఆయనంటే ఆస్ట్రేలియా భారతీయ సమాజంలో ముఖ్యంగా తెలుగు సమాజంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. సమాజ నిర్మాణంలో, దిశానిర్దేసాలు, సామాజిక అవసరాలు, భావితరాల ఆలంబన గుర్తించడంలో ముందు చూపుతో ఎంతో కృషి చేసిన వ్యక్తిత్వము. విద్య, ఆరోగ్య, రాజకీయ, వ్యాపార, సాంకేతిక రంగాలలో విశేషమైన కృషి చేసిన కృషీవలుడు.

శ్రీ కృష్ణ నడింపల్లి – తెలుగు సమాజంలో తన ఆత్మకథను వ్రాసుకొని చరిత్ర పుటల్లో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి. ఇది భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలుస్తుందని వక్తలందరూ ఆకాంక్షించడం ఎంతో ముదావహం.

కేన్బర్రా లోని ఫ్లోర్రీ టెంపుల్ “శాంతినికేతన్” హాలు వేదికగా “శ్రీ కృష్ణ నడింపల్లి “ గారి ఆత్మకథ “శిఖరం చేరిన కెరటం” ఆవిష్కరణ సభ జయప్రదంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఎంతోమంది పురప్రముఖులు Canberra MLA Peter Cain (Member of Ginninderra), Amardeep Singh, Harjinder Singh, Kanti Jina (OAM) మరియు తెలుగు సభ్యులు, అసోసియేషన్ల అధ్యక్షులు విచ్చేశారు.

మొదటిగా చిద్రూపి గారి వందన సమర్పణతో కార్యక్రమం ప్రారంభించబడింది .. ఆ తరువాత రుద్ర గారు పుస్తక పరిచయాన్ని కొనసాగించి కృష్ణగారి 20సంవత్సరాల కేన్బర్రా జీవితాన్ని మరియు పుస్తకంలోని విషయాలను క్లుప్తంగా విశదీకరిస్తూ ఆయన చేసిన ప్రసంగం సభికులను అలరింప చేసింది.

వేదికమీద పెద్దలందరూ కృష్ణగారితో వారి అనుభవాల్ని పంచుకుంటూ ఆయన వ్యక్తిత్వాన్ని వివరించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నది.. ఆ తరువాత కృష్ణగారితో కలిసి పుస్తక ఆవిష్కరణను చేసి అందరికీ ప్రతులను అందచేశారు .. చివరిగా కృష్ణగారి ప్రసంగంతో ఆ సాయంత్రం అందరి జ్ఞాపకాలను మరియు కృష్ణగారితో తమ అనుబంధాన్ని నెమరువేసుకుని అల్పాహారాలతో ముగించడం ఆద్యంతం ఆనందదాయకంగా కార్యక్రమం ముగిసింది

Scroll to Top