ఉసిరి రసంతో ఆరోగ్యానికి ఊపిరి


ఉసిరిక కాయల రసం పలు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఒక పెన్నిధి వంటిదని నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
*ఉసిరి రసం ప్రతీ రోజు 50 ఎంఎల్ తీసుకోవటం ద్వారా ఎన్నో దీర్ఘ కాలిక సమస్యలు నియంత్రణలో ఉంటాయి.
*ఆజీర్తి, గుండె సంబంధిత సమస్యలు, షుగర్ లెవల్స్ తో పాటుగా కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
*జుట్టు నల్లగా మార్చటానికి ఉసిరిక కాయల రసం సహకరిస్తుంది.
*ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోషకాల శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో పోషకాల లోపం దరి చేరదు.
*ఉసిరి రసంలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని బలంగా మార్చుతుంది.
*ఉసిరి రసం తాగితే సీజనల్‌ ఇన్ఫెక్షన్ల రిస్క్‌ తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణ స్రావాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రావు. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది.
*ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. *ఉసిరి తింటే చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో ముడతలు తగ్గుతాయి.
*జుట్టును వేర్ల నుండి సహజంగా నల్లగా మార్చడానికి ఉసిరి రసం తోడ్పడుతుంది.

Scroll to Top