ఇది గ్రాఫిక్స్ కాదు…

–ఓ ఫోటోగ్రాఫర్ సాహసం

ఈ ఫోటో చూసి ఇదేదో హాలీవుడ్ సినిమాలోని గ్రాఫిక్స్ అని ఫిక్స్ అయిపోతున్నారా…. ఆగండాగండి… ఈ ఫోటోలో ఉన్నది వాస్తవ దృశ్యమే..ఈ అద్భుత చిత్రాన్ని ఆస్ట్రేలియాకు చెందిన అండర్‌ వాటర్‌ ఫొటోగ్రాఫర్‌ టామ్‌ కేనన్‌ తీశారు. ఈ ఫొటోను ఆయన పశ్చిమ ఆస్ట్రేలియాలోని నింగలూ రీఫ్‌ ప్రాంతంలో క్లిక్‌మనిపించారు…..చుట్టూ అంతుతెలియని సముద్రం…పైన ఇంతే ఉన్న చిన్నపాటి బోటు. కిందన అంతోటి సైజున్న వేల్‌ షార్క్‌.. .. ఆ వేల్‌ షార్క్‌ జస్ట్‌ అలా బుర్రెత్తి పైకి చూస్తే.. బోటు పని అంతే…అందులో ఉన్నోళ్ళంతా ప్రాణాలమీద ఆశలు వదులుకోవాల్సిందే. వేల్‌షార్క్‌ ప్రపంచంలోనే అతిపెద్ద చేప. అసలు తమ బోటు కింద ఈ భారీ తిమింగలం ఉందన్న సంగతి బోటులోని వాళ్లకు తెలియదని.. వేల్‌షార్క్‌ కొంచెం ముందుకు వెళ్లాక దాన్ని చూసి.. ఆనందాశ్చర్యాలకు లోనయ్యారని టామ్‌ తెలిపారు. సాధారణంగా ఇవి లోతైన ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాయని.. ఇలా రావడం అరుదుగా జరుగుతుంటుందని చెప్పారు. సముద్రపు లోతుల్లో తాము చాలా చిత్రాలు తీస్తుంటామని.. ఇలాంటి ఫొటోతీయడం వేలల్లో ఒకసారి మాత్రమే జరుగుతుందని టామ్‌ మీడియాకు చెప్పారు. ఇలాంటి ఫోటోలు ఎంతో సాహసం చేస్తేగానీ తీయడం కష్టమే.

Scroll to Top