ఆంధ్ర దేశమవతరించె ఆస్ట్రేలియా ఖండమున
దేశమంటే మనుషులను సూక్తి నన్వయించి.
పుట్టింటి మమకారమొక వంక మొగ్గుచూప
సుఖ జీవన శైలి వీడలేని దైన్యము నెలకొని,
రెంటి నడుమ కొట్టు మిట్టాడు జీవితములనగ.
పౌరసత్వము గొనిన అచ్చ మైన అస్ట్రేలియనులము-
ఆస్ట్రేలియత్వము అసలు ,భారతీయత వెనుక
ఇది నానా జాతి సమైక్య ప్రజా సమితియన్న జెల్లు
యావత్ప్రపంచము ప్రతి బిమ్బించు నాస్త్రాలియా దర్పణ మున
జాతి దురహంకరముల కిచట తావెలేదు
ప్రాంతీయ విభేదములు లేనేలేవు
వివిధ మత సంస్కృతీ సాంప్రదాయముల కాలవలమై
ఈ దేశ చరిత మొదలు అనాది ఎబరిజన కల్చరుతో,
గత మూడు శతాబ్దముల పాశ్చ్యాత్య నాగరికత
క్రైస్తవ మత సిద్ధాంత మానవీయత
నేటి జాతీయ విలువల ప్రాతి పదికలు
సామరస్య సహజీవనమ్బిటసాగుచుండు
హైన్దవేతరులను గౌరవింతుము గాక !
భారతజాతి సంస్కృతీ మరువకున్దుము గాక !
ఏ జాతికేని పూర్వ చారిత్రిక వైభ వో న్నతులె గర్వ కారణంబు
ఆ చరిత్ర పుట్టిన గడ్డకు ముడి పడియుండు
భూరుహము భూమి నంటి పెట్టియున్నటుల
మూన్నాళ్ళది గాదు మున్నెన్నటిదో!
నేటికాదర్శమై నిలిచి యుండవలయు .-
శేష ప్రపంచము నిద్రించగా జాగృతి నొంది ,
అతి ప్రాచీన, అత్యన్తాధునిక, సర్వజనీన,సార్వత్రిక
సనాతన ధర్మ సంస్థాపన, ఉపనిషద్వైభవోన్నతులు గాంచి,
ఋషి ప్రోక్త “వసుధైక కుటుంబమ్ ” , “ఏకం సత్ విప్రా బహుదా వదంతి ”
“అహం బ్రహ్మాస్మి “, “సత్యమేవ జయతే ” ఇత్యాది వైదిక సూక్తులు ప్రవచించిన
ఏకైక వాణి ,ప్రప్రధమ సత్య దర్శని ,మన భరత మాత!
సుఖ దుఃఖములు సమ దృష్టి జూచు
జీవిత పరమార్ధము ,శాశ్వతానందము
కఠిన మార్గమున నెరుగబడునను
సత్యము తెలిసిన కర్మ భూమి మనది .
మాయాజాన్డ కరండ కోటిన్
మిథ్యా కల్పిత శాశ్వత భౌతిక సుఖాన్వేషణ
నేటి వ్యర్థ వైజ్ఞా నిక యంత్రయుగ నాగరికత;
ప్రవృత్తి మార్గ ప్రగతి యెంత సాధించిన
సంకుచిత భావ, స్వార్ధ చింతనలు పోక శాంతి ఎయ్యది ?
తృష్ణ శాంతించి ,తృప్తి యలవడ,
సుగమమౌ, నివృత్తి మార్గ ఆధ్యాత్మ సాధనా ఫలము
జన్మరాహిత్య నిత్యానందానుభూతి.