పల్నాటి యుధ్ధం బొబ్బిలి యుధ్ధం వారసులం
మనలో మనమే తన్నుకు చస్తాం తప్ప వేరెవరితో చేస్తాం యుధ్ధం
వెలుతురును మింగి విర్రవీగేది నిశి
విజ్ణానాన్ని మింగి వీదిన పడేది కసి
ఎదుటివాడు చిక్కుల్లో పడితేనే మనకు వేడుక
సూర్య చంద్రుల్ని గ్రహణం రోజే చూడ్డం మన వాడుక
నిన్న రేపు అనుకున్నదే నేడు
మరి ఎందుకిలా మారింది తెలుగు నాడు?
రాళ్ళతో చెక్కుతున్నాం గాంధీలను లక్షల్లో
తయారు చేయలేక పోతిమి ఒక్క గాంధీని మనుషుల్లో
తెలంగాణా అయినా ఆంధ్రా అయినా మన తెలుగు తల్లికే మల్లె పూదండ
ఏది ఎటు అయినా ఆస్ట్రేలియాలో మాత్రం మనమే ఒకరికొకరము అండ
ఏ విదమైన ఖర్చుతో నిమిత్తం లేకుండా, భగవంతుని ప్రసాదంగా మానవాళికి సంక్రమించిన శాశ్వత ఆభరణమైన చిరునవ్వుకు మీ మధురభాషణాన్ని జోడించి ఆత్మీయతా అనురాగాలతో అందరూ తులతూగాలని కోరుకుంటూ..
తెలుగు జాతి మనది – నిండుగ వెలుగు జాతి మనది.! జై తెలుగు తల్లి!!