నింగిన ఎగిరే పక్షులు ఎన్నో, ఆ పక్షులకు గూడునిచ్చే వృక్షాలెన్నో
తీరం చేరే కెరటాలు ఎన్నో, ఆ తీరాన ఉన్న ఇసుక రేణువులెన్నో
నేలపైనున్న జీవులు ఎన్నో, ఆ జీవులు చేసే వింతలు ఎన్నో
కురిసే వానలో చినుకులు ఎన్నో, ఆ చినుకులు నింపే కొలనులు ఎన్నో
సూర్య కాంతిలో కిరణాలు ఎన్నో, ఆ కిరణాలిచ్చే వెలుగులు ఎన్నో
అంతరిక్షంలోని గ్రహాలు ఎన్నో, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రరహాలెన్నో
ప్రకృతిలోని అందాలెన్నో, ఆ అందాలిచ్చే ఆనందాలెన్నో
సృష్టిలోని తరాలెన్నో, ఆ తరాల మథ్య అంతరాలెన్నో
ఎవరిస్తారు ఈ ప్రశ్నలకు జవాబులు అంటే
ఆస్తికుడు చెబుతాడు దేవుడని, నాస్తికుడు అడుగుతాడు వాడెవ్వడని
–సి వి రావు సిడ్నీ