మనుషులు బాధలో కళ్ళతో వేదన వ్యక్తం చేస్తారు!
సుఖంలో దుఃఖంలో కనులవెంట నీరు కారుస్తారు!
ఆత్మీయులు కంటబడితే సంతోషం కనబరుస్తారు!
మంచి రోజులు దూరమైతే మనస్సులో కృంగిపోతారు!
నాలుగు క్షణాలు దొరికితే నలుగురిని అలరించు!
నాలుగు రోజులు దొరికితే స్నేహితులను ఆదరించు!
నాలుగు మాసాలు దొరికితే పుణ్యతీర్ధాలు సందర్శించు!
నాలుగు కాలాలపాటు నీవుంటే సమాజాన్ని సేవించు!
తను తనవారి గురించి “బ్రతకాలనుకోవటం” అందరియొక్క వాంఛ!
కొందరి హృదయాలలో “బ్రతకాలనుకోవటం” మంచివారలకు వాంఛ!
సత్విద్యను “బ్రతికించాలనుకోవడం” మహనీయుల హృదయ వాంఛ!
సద్గురువును “సేవించాలనుకోవడం” ముముక్షువుల ముక్తినికోరే వాంఛ!
తెలుగుమాటలో కమ్మదనము! రుచిచూడు!
తెలుగుభాషలో జ్జ్ఞానధనము! తరచి చూడు!
తెలుగువారిపై ప్రేమధనము! కురిపించి చూడు!
తెలుగుతల్లికి భక్తి వందనము! సమర్పించు నేడు!