భగ్గుమంటోంది భారతం!!!

భగ్గుమంటోంది భారతం
అలనాటి రామరాజ్యం ,
ఈనాడు రాబందుల రాజ్యం ,
ఒకనాడు ,భరతమాతకు మకుటాయమానమై,
ఒప్పిన సుందర కాశ్మీర్ నేడు
పొరుగు పాకిస్తాన్ దురాగత బాంబు దాడులు,
మారణహోమాలతో
అంతః కలహాలు, ఎటుజూచినా
అత్యాచారాలు హత్యలు, దోపిడీలు,
ప్రేన్మాదుల యాసిడ్ దాడులు
అమాయక స్త్రీల బలి దానాలు, । భగ్గు మంటోందిభారతం

సీతా,సావిత్రి అనసూయ ,
సుమతి ఆది ప్రతివ్రతామ తల్లులు ,
ఏక పత్నీ వ్రతుడు ,
శ్రీరామచంద్ర ప్రభువుద్భవించిన
పవిత్ర పుణ్య భూమీనేడు
నైతిక విలువల వీడి
అక్రమబందాల ములిగి,
కన్నబిడ్డ ‘షీరా బొనానే”
కడతేర్చిన కసాయితల్లి,
మధువు మైకాన మనుగడ మరచి,
కన్నతల్లినే కాంక్షించిన,
పుత్రుని అన్య విధాన మరల్చి,
సుద్ధుని గావింపక ఆవేశాన కౄరంగా,
కడతేర్చిన కన్నతల్లి,
అమృతకలసమంటి,
మాత్రు మమతను
మైలపరచిన మహిళల । భగ్గు మంటోందిభారతం

కంచెగా నిలిచి కాపు కాయదాగు కన్నతండ్రి
కన్నబిడ్డపై అత్యాచరములతొ
స్రీకి రక్షణ కరవైన తీరుకు ,విల విల లాడి
॥ శోకాన భగ్గు మంటోంది భారత జనని ,॥

ఒకవంక భూ, జల ,ఆకాశయాన
వాహన మృత్యు ఘోషలు ,
ఇంకొక్ వంక ప్రకృతి భీభాత్సములు తో,
అల్లాడి భగ్గు మంటోంది ,॥ పవిత్ర భారత జనని ॥

కామేశ్వరి సాంబమూర్తి భమిడిపాటి

Scroll to Top