సాంప్రదాయంలో వ్యత్యాసం

సాంప్రదాయ బద్ధం
క్రమం తప్పక, నిష్టలు నిత్యం పాటించే సాంప్రదాయం!
కష్టమని తలచక, కర్తవ్యాలను గాలికి వదలని సాంప్రదాయం!
భూమిపై దేవతలను, త్రికరణ శుద్ధిగా గౌరవించే సాంప్రదాయం!
నోముల పంటలను, చక్కని పౌరులుగా తీర్చిదిద్దే సాంప్రదాయం!
సమాజమేదయినా, మంచి మనిషిగా మసలుటే అసలైన సంప్రదాయం!

ఆధునిక వాదం
కట్టుబొట్టుమార్చి, కర్తవ్యాలు వదిలే ఆధునికం!
చేష్టలుమార్చి, నిష్టలు గాలికి వదిలే ఆధునికం!
జంటలు విడిపోయి, పిల్లలు వ్యధతో పెరిగే ఆధునికం!
కనిపెంచిన దేవతల, యిక్కట్లపాలు చేయు ఆధునికం!
కాలం మారిందని, విలువలు వదిలేసే ఆధునికం!

—–డా.రాంప్రకాష్ ఎర్రమిల్లి

Scroll to Top