స్వాతంత్రం ! ఎవరికీ? భారత దేశానికా? లేక
దేశంలో నివసించే ప్రజలకా ? దేశానికైతే…
ఎలాగోలా, ఎట్టకేలకు వచ్చిందిలే, 1947లో
ఏంటీ… ? ఎంతోమంది, కష్టపడి తెచ్చారా?
ఏమిలేదు? 200 సంత్సరాలు పట్టిందిగా తేడానికి
అందుకని, అందునా ఆ మధ్యలో దరిదాపుగా
రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినతర్వాత
ఆర్ధికంగా ఆంగ్లేయులు బాగా దెబ్బతినగా
ఇంకేం మిగిలింది? అంతా దొచేసుకున్నాంగా !
అని వాళ్ళు ఇచ్చేస్తే వచ్చిందా? మనం సాధించిందా?
ఆలోచించండి, అందరం ఆంగ్లేయుల వద్ద బానిసలమేగా?
మరి స్వాతంత్రం తరువాత కూడా ఎందుకున్నాయి?
కులాల, మతాల మధ్య కుటిలమైన కుమ్ములాటలు
అవినీతి, అసమానతలు.. అస్సహాయత, నిస్సహాయతలు
పేద, ధనిక వర్గాల మధ్య ఎక్కువైపోయిన వత్యాసాలు
దీనిని బట్టి మీకేమనిపిస్తుంది … ఇప్పటి స్వాతంత్ర్యం
స్వతంత్రంగా మనకు వచ్చిందా? తెచ్చిందా? ఇచ్చిందా ?