మానవజాతి హితంకోరేదే మతమని
వేదమన్నది ఏ మతం సొంతంకాదని
భక్తి, రాజ, జ్ఞాన యోగాలతో
ధార్మికతకు, ఆధ్యాత్మికతకు
అర్థం చెప్పిన అద్వైత గురువు
వేదాంత విషయ విశ్లేషణ, వివరణలతో
యోగిగా, విరాగిగా, బైరాగిలా జీవించి
మానవాళికి యోగ, వేదాంతకాంతులు
పంచిన విధాత, విశ్వ యువత భవితకు
మార్గదర్శి, మానవతామూర్తి, స్పూర్తిప్రదాత
నరేంద్రుడు, నిష్కల్మషుడు, అసమాన్యుడు
దీన జనోభవ! అన్న కరుణరసమూర్తి
ఆత్మానన్దస్వరూపుడు..స్వామి వివేకానంద!